News December 4, 2024

పెద్దపల్లిలో సీఎం షెడ్యూల్ ఇదే

image

* గ్రూప్4 ఉద్యోగాలకు నియామకపత్రాలు అందజేత
* సింగరేణిలో వివిధ ఉద్యోగాలకు ఎంపికైన 593 మందికి నియామకపత్రాలు అందజేత
* 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు నియామకపత్రాలు అందజేత
* స్కిల్ వర్శిటీలో భాగమయ్యే సంస్థలతో ఒప్పందాలపై సంతకాలు
* డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్, సీఎం కప్ ప్రారంభం
* బస్ డిపో, పెద్దపల్లి-సుల్తానాబాద్ బైపాస్ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన
* కొత్తగా మంజూరైన పోలీస్ స్టేషన్లు ప్రారంభం

Similar News

News March 6, 2026

మిషన్ మోడ్‌లో ‘ప్రజా పాలన’: కలెక్టర్ చిత్రా మిశ్రా

image

కరీంనగర్ జిల్లాలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ను మిషన్ మోడ్‌లో పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్టర్ చిత్రా మిశ్రా స్పష్టం చేశారు. శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో 99 రోజుల కార్యాచరణపై ఆమె పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 10 ప్రత్యేక అంశాలతో (థీమ్స్) ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు.

News March 6, 2026

UPDATE: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

image

<<19312594>>బైక్‌ను టిప్పర్<<>> ఢీకొన్న ఘటనలో చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు చిలుక ప్రదీప్ కుమార్, తాటికొండ సాయి కిరణ్ మృతి చెందారు. శుక్రవారం ఈ ఇద్దరు మిత్రులు బైక్‌పై వెళుతుండగా చాకుంట ఎక్స్ రోడ్డు వద్ద అతి వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరి యువకుల తలలు నుజ్జునుజ్జు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 6, 2026

రామడుగు: రెండు రోజుల్లో పెండ్లి.. ఇంతలోనే దారుణం..!

image

పెళ్లిబాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో చావు డప్పు మోగింది. రామడుగుకు చెందిన ఈరెల్లి గౌరమ్మ (65) తన పెద్ద కుమారుడి వివాహ ఏర్పాట్లలో ఉండగా, హత్యకు గురి కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘాతుకం వెనుక తెలిసిన వారే ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆస్తి గొడవలే ఈ దారుణానికి కారణమని భావిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.