News December 4, 2024

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో నేడూ వర్షాలు

image

ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో కర్నూలు జిల్లాలో రెండ్రోజుల నుంచి వర్షం పడుతోంది. పట్టణాలు, గ్రామాలు చిత్తడి చిత్తడిగా మారాయి. ఈ వర్షాలు నేడూ కొనసాగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Similar News

News December 5, 2024

మహిళల, బాలబాలికల భద్రత, రక్షణకు సమన్వయంతో పనిచేయాలి: ఎస్పీ

image

మహిళల భద్రత, రక్షణకు, బాల్యదశను ఉన్నతంగా తీర్చిదిద్దే విధంగా అన్ని శాఖలు కలిసి సమన్వయంతో పని చేయాలని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో కర్నూలులోని వివిధ శాఖల సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించాలనే కరపత్రాలను ఆవిష్కరించారు.

News December 4, 2024

‘పుష్ప-2’ విడుదల.. శిల్పా రవి ఆసక్తికర ట్వీట్ 

image

తన స్నేహితుడు అల్లు అర్జున్ ‘పుష్ప-2’ విడుదల సందర్భంగా నంద్యాల YCP మాజీ MLA శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ కదా?.. వైల్డ్ ఫైర్’ అని అర్థం వచ్చేలా ఎమోజీలతో ట్వీట్ చేశారు. శిల్పా రవి ఈ రాత్రికే ఈ మూవీని వీక్షించనున్నట్లు సమాచారం. మరోవైపు జిల్లాలోని థియేటర్ల వద్ద ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ సందడి నెలకొంది. 

News December 4, 2024

పేరెంట్స్, టీచర్స్ సమావేశానికి ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు: కలెక్టర్

image

డిసెంబరు 7న జరిగే మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా విద్యా శాఖాధికారులను ఆదేశించారు. బుధవారం మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం ఏర్పాట్లపై ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్వహణకు సంబంధించి 13 కమిటీలను ఏర్పాటు చేశారా, లేదా అని అడిగి తెలుసుకున్నారు.