News December 4, 2024
డ్రోన్ల వినియోగం విస్తృతం చేయండి: సీఎం

అమరావతి: భద్రత, నేర నియంత్రణ, ప్రజా సేవలకు డ్రోన్ల వినియోగాన్ని విస్తృతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వెలగపూడి సచివాలయంలో డ్రోన్ డెమోను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిర్వహణ, రవాణా సౌకర్యాలు లేని ప్రాంతాలకు మందుల పంపిణీ, పారిశుద్ధ్య చర్యల కోసం డ్రోన్లను వినియోగించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను కోరారు.
Similar News
News March 2, 2026
దుగ్గిరాలలో రోడ్డు ప్రమాదం.. చెట్టు ఎక్కిన బైక్!

బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకులు గాయపడగా, వారి వాహనం వింతగా చెట్టుపైకి దూసుకెళ్లిన ఘటన దుగ్గిరాల లాకు వద్ద జరిగింది. చినరావూరుకు చెందిన కిషోర్, విజయ్ ప్రయాణిస్తున్న బైక్ ప్రమాదవశాత్తూ పడిపోగా, బైక్ మాత్రం చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోయింది. గాయపడిన యువకులను చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News March 2, 2026
తుళ్లూరులో కొడుకుని పట్టించిన పేరెంట్స్..!

తుళ్లూరు మండల పరిధిలోని గ్రామాల్లో ఆవులను దొంగతనం చేస్తున్న వ్యక్తిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు శ్రీకాంత్ మండల వ్యాప్తంగా సుమారు 25 ఆవులకు పైగా అపహరించినట్లు పలువురు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతణ్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా, స్టేషన్ వెనకవైపు ఉన్న గోడ దూకి పారిపోయాడు. తిరిగి కుటుంబ సభ్యులు పోలీసులకు అప్పజెప్పగా సిబ్బంది పేరెంట్స్‌ను అభినందించారు.
News March 2, 2026
గుంటూరులో ప్రారంభమైన రెవెన్యూ క్లినిక్

గుంటూరు కలెక్టరేట్ శంకర్ సమావేశ మందిరంలో రెవెన్యూ క్లినిక్ సోమవారం ప్రారంభమైంది. జేసీ శ్రీవాత్సవ, ఆర్డీఓ శ్రీనివాసరావు డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భూ సమస్యలు, వివాదాలకు సంబంధించిన అర్జీలు అందాయి. రెవెన్యూ క్లినిక్ వచ్చే సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని జేసీ అధికారులను ఆదేశించారు.


