News December 4, 2024
BREAKING: ఉమ్మడి నల్గొండ జిల్లాలో భూకంపం

ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. సూర్యాపేట, అంజనపురి కాలనీ, మునగాల, నకిరేకల్, చౌటుప్పల్, మిర్యాలగూడ, కొదాడ, ఏన్కూర్, భువనగిరి, ఆత్మకూరు, సిరికొండ, పానగల్, తిరుమలగిరి పలు చోట్ల భూమి కంపించింది. ఉదయం 7:30 గంటలకు 3 సెకన్ల కంపించినట్లు తెలుస్తోంది. భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మీ ప్రాంతంలోనూ భూమి కంపించిందా? కామెంట్ చేయండి.
Similar News
News March 21, 2026
NLG: సాగునీటి వివక్షపై సీపీఐ పోరు!

జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న అన్యాయంపై సీపీఐ సమరశంఖం పూరించింది. ముఖ్యంగా డిండి ప్రాజెక్టు నిర్మాణంలో ప్రదర్శిస్తున్న వివక్షను ఎండగడుతూ భారీ ఉద్యమాలకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ అన్యాయాన్ని నిరసిస్తూ ఏప్రిల్ 1, 2 తేదీలలో బీసీ టన్నెల్, ఏదుల రిజర్వాయర్ ప్రాజెక్టులను సీపీఐ బృందం సందర్శించి వాస్తవాలను పరిశీలించనుంది. ఏప్రిల్ 5న అఖిలపక్ష సదస్సును నిర్వహించనున్నారు.
News March 21, 2026
NLG: ముగింపు దశలో మొలకెత్తిన ఆశ!

జిల్లాలోని అన్నదాతల నిరీక్షణకు తెరపడనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’ నిధులు రేపటి నుంచి రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. యాసంగి సీజన్ ముగింపు దశకు వస్తున్న తరుణంలో, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతాంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. జిల్లాలో ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో 5.56 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. సాగు కోసం అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్న రైతులకు ఊరట కలగనుంది.
News March 21, 2026
నల్గొండ జీజీహెచ్‌లో వేధింపుల కలకలం..!

నల్గొండ జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రక్షణ కరువైంది. ఎక్స్‌రే విభాగంలో శిక్షణ పొందుతున్న ఓ పారామెడికల్ విద్యార్థినిపై అక్కడే అవుట్‌సోర్సింగ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న వ్యక్తి గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు తెగబడుతున్నాడు. నిందితుడి వేధింపులు మితిమీరడంతో భరించలేకపోయిన బాధితురాలు శనివారం ‘డయల్ 100’కు ఫిర్యాదు చేసింది.


