News December 4, 2024
గత ఏడాది BRSకు కష్టంగా గడిచింది: KTR

TG: బీఆర్ఎస్ ఏడాది కాలంగా చాలా ఎదురుదెబ్బలు, సవాళ్లు ఎదుర్కొందని KTR అన్నారు. గత ఏడాది పార్టీకి చాలా కష్టంగా గడిచిందన్నారు. ‘మీరు ఎంత గట్టిగా దెబ్బకొట్టారన్నది కాదు. ఎంత గట్టి దెబ్బ తగిలినా పోరాటం కొనసాగించడమే ముఖ్యం. ఇప్పుడు మనం రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడి పోరాడుతున్నాం. KCR నాయకత్వానికి, పార్టీ కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు థాంక్యూ. మరో 4 ఏళ్లు మిగిలుంది’ అని ట్వీట్ చేశారు.
Similar News
News March 15, 2026
ఫింగర్ ప్రింట్‌లాగే టంగ్ ప్రింట్స్.. తెలుసా?

ప్రతి మనిషికి వేలిముద్రలు ఎలాగైతే వేర్వేరుగా ఉంటాయో నాలుక ముద్రలు (Tongue prints) కూడా అలాగే ఒకరితో ఒకరికి అస్సలు పోలి ఉండవు. ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తుల నాలుక ఆకృతి, ఉపరితల నిర్మాణం ఒకేలా ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కవలల విషయంలోనూ ఇవి భిన్నంగానే ఉంటాయి. ఫ్యూచర్‌లో ఇది అత్యంత నమ్మదగిన బయోమెట్రిక్ గుర్తింపుగా మారే అవకాశం ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో
News March 15, 2026
22న రైతు భరోసా నిధులు

TG: రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 22వ తేదీ రైతు భరోసా మొదటి విడత నిధులు ఇవ్వాలని నిర్ణయించింది. సిద్దిపేట(D) నర్మెట్టలో CM రేవంత్ రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు 20రోజుల తర్వాత రెండో విడత, APR నెలాఖరులోగా మూడో విడత నిధులు అందజేయనున్నారు. 3 విడతల్లో కలిపి రైతుల ఖాతాల్లో సుమారు రూ.9 వేల కోట్లు జమ కానున్నాయి.
News March 15, 2026
LSGకి బిగ్ షాక్?

ఈ నెలాఖరున ప్రారంభమయ్యే IPLలో LSG జట్టుకు కీలక ప్లేయర్ దూరం కానున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా గాయం కారణంతో ఈ సీజన్ ఆడటం అనుమానమే అని అంటున్నాయి. తొడ కండరాల గాయం వల్ల T20WCలోనూ అతను ఆడలేదు. ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదని సమాచారం. ఈసారి వేలంలో ఇతడిని LSG రూ.2కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గత సీజన్లో హసరంగా RR తరఫున ఆడి 11 వికెట్లు తీశారు.


