News December 4, 2024

కడప జిల్లాపై లేని భూప్రకంపనల ప్రభావం

image

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం భూ ప్రకంపనలు రావడం సంచలనంగా మారింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఎక్కడ ప్రమాదాలు జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా ఉమ్మడి కడప జిల్లాలో ఎటువంటి ప్రకంపనలు రాకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. మన జిల్లాలో ఎక్కడైనా భూప్రకంపనల ప్రభావం ఉంటే కామెంట్ చేయండి.

Similar News

News March 26, 2026

ఫుట్‌బాల్ టీంకు ఏడుగురు జిల్లా పోలీసుల ప్రాతినిధ్యం

image

తెలంగాణలో జరగనున్న 74వ బీఎన్ ముల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్ షిప్-2026 పోటీలకు ఏపీ పోలీస్ జట్టుకు జిల్లాకు చెందిన ఏడుగురు పోలీసులు ప్రాతినిధ్యం వహించారు. ఎన్. నాగేంద్ర (డీఏఆర్), కె. బాబు (జీపీఆర్), బి.సిద్దారెడ్డి (డీఏఆర్), ఎస్.ఇమామ్ ఖాసిం (ఆర్ ఎస్ఐ) తిరుపతి (ఎర్రగుంట్ల), ఎల్.సతీష్బాబు (ట్రాఫిక్, కడప), జి.రాజశేఖర్ (డి.ఎ.ఆర్), ఎస్.శివ సుబ్రమణ్యం (డి.ఎ.ఆర్) ఉన్నారు.

News March 26, 2026

కడప జిల్లా వ్యాప్తంగా 325 కేసులు నమోదు

image

కడప జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో బుధవారం సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించని 325 మందికి రూ.74,025 జరిమానా విధించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ద్విచక్ర వాహనాలలో ప్రయాణించేవారు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణం చేసేవారు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు.