News December 4, 2024
సంతోషాన్ని పంచుకునేందుకు వస్తున్నా: CM

TG: తమ ఏడాది పాలనలో నిరుద్యోగం తగ్గిందని సీఎం రేవంత్ అన్నారు. 55వేల ఉద్యోగాల నియామకాలు పూర్తి చేశామని, పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు. ‘మొన్న కొలువులే ఆలంబనగా కొలిమిలా మండిన ఉద్యమం. నిన్న కొలువులే ఆకాంక్షగా జంగ్ సైరనై మోగిన నా రణం. నేడు కొలువుల కలలు నిజమైన క్షణం. ఈ సంతోషాన్ని యువ మిత్రులతో పంచుకునేందుకు నేడు పెద్దపల్లికి వస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News March 24, 2026
క్రూడాయిల్, ఎరువులపై ఫోకస్!

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పెట్రోలియం, ఫర్టిలైజర్స్ శాఖలపై కేంద్రం నిర్వహిస్తున్న కీలక <<19465756>>భేటీ<<>> కొనసాగుతోంది. ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల కొరత రాకుండా మొరాకో నుంచి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. హార్ముజ్ నుంచి కాకుండా ఇతర మార్గాల ద్వారా క్రూడాయిల్ సరఫరాకు ప్రత్యామ్నాయాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధనం ఉందని, ప్రజలు పానిక్ బయింగ్ చేయొద్దని కేంద్రం తెలిపింది.
News March 24, 2026
హరీశ్ రాణా చనిపోయారు

13 ఏళ్లుగా కోమాలో ఉన్న హరీశ్ రాణా(32) తుదిశ్వాస విడిచారు. ఢిల్లీ AIIMSలో ఇవాళ కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 100 శాతం కోమాలో ఉండటంతో హరీశ్ రాణాకు కారుణ్య మరణం(<<19390967>>Passive Euthanasia<<>>) కింద వైద్య సహాయాన్ని <<19352489>>నిలిపివేసేందుకు<<>> సుప్రీంకోర్టు ఇటీవల అనుమతించింది. దేశంలో ఇలాంటి కేసు ఇదే మొదటిది. ఈ క్రమంలో హరీశ్‌కు లైఫ్ సపోర్ట్‌ను AIIMSలో ప్రత్యేక వైద్య బృందం క్రమంగా తొలగించింది.
News March 24, 2026
కరోనా విషాదాలను ప్రధాని మరచిపోయారు: రాహుల్

పశ్చిమాసియా సంక్షోభాన్ని <<19465598>>కరోనాతో పోలుస్తూ<<>> ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కొవిడ్ సమయంలో చోటుచేసుకున్న ఘటనలను, విషాదాలను ఆయన మరచిపోయారని విమర్శించారు. భారత విదేశాంగ విధానం మోదీ పర్సనల్ పాలసీలా మారిపోయిందని ఆరోపించారు. ప్రధాని రాజీపడ్డారంటే మన విదేశాంగ విధానమూ రాజీపడినట్లేనని అన్నారు.


