News December 4, 2024
కాకినాడ షిప్‌లో మరోసారి తనిఖీలు

AP: కాకినాడ పోర్టులో డిప్యూటీ CM పవన్ సీజ్ చేయించిన షిప్‌లో ఇవాళ మరోసారి తనిఖీలు చేస్తున్నారు. మల్టీ డిసిప్లీనరీ కమిటీ సముద్రంలోకి బయల్దేరగా, రేషన్ బియ్యం నమూనాలు తీసుకోనుంది. బియ్యం ఏ గోదాం నుంచి షిప్‌లోకి వచ్చింది? ఎంత మొత్తంలో ఉంది? తదితరాలపై కమిటీ నేడు వివరాలు సేకరించనుంది. పోర్టు, కస్టమ్స్, పౌరసరఫరాలు, పోలీసు, రెవెన్యూ అధికారులతో కూడిన కమిటీ నేడు ఆ వివరాలను కలెక్టర్‌కు అందించనుంది.
Similar News
News March 19, 2026
గ్యాస్, క్రూడ్ డేటా ఇవ్వండి.. ఆయిల్ కంపెనీలకు కేంద్రం ఆదేశం

పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాకు ఆటంకం కలగకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా చమురు, గ్యాస్ కంపెనీలు తమ వద్ద ఉన్న నిల్వలు, ఉత్పత్తి, వినియోగం, దిగుమతులకు సంబంధించిన డేటాను తమకు ఇవ్వాలని ఆదేశించింది. దీని ఆధారంగా సప్లై చెయిన్‌ను మరింత సమర్థంగా పర్యవేక్షించడమే లక్ష్యమని పేర్కొంది.
News March 19, 2026
ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ నిజం కాదా?

ఇరాన్ 2 వారాల్లోనే న్యూక్లియర్ బాంబ్ తయారు చేసే అవకాశం ఉన్నందునే Feb 28న దాడులు చేశామని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే US మాజీ కౌంటర్ టెర్రరిజం చీఫ్ కెంట్ ఈ వాదనను కొట్టిపారేశారు. ఇరాన్ న్యూక్లియర్ వెపన్ తయారీని నిషేధిస్తూ గతంలో జారీ చేసిన ‘ఫత్వా’ను ఉల్లంఘించినట్లు ఎటువంటి ఆధారాలు లేదన్నారు. ఖమేనీ హత్య ఇరాన్‌ను మరింత రెచ్చగొట్టిందని, ఈ దాడుల వల్ల శాంతి నెలకొనే అవకాశం లేదని పేర్కొన్నారు.
News March 19, 2026
సహజీవన జంటలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. గుజరాత్‌లో UCC బిల్

గుజరాత్ ప్రభుత్వం అసెంబ్లీలో UCC(యూనిఫామ్ సివిల్ కోడ్) బిల్లును ప్రవేశపెట్టింది. దీని ప్రకారం సహజీవనంలో ఉండే జంటలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెలలోగా ఇలా చేయకపోతే 3M జైలు శిక్ష/₹10K ఫైన్, ఒక్కోసారి రెండూ విధిస్తారు. బలవంతం/మోసపూరితంగా వ్యవహరిస్తే ఐదేళ్ల జైలు శిక్ష ఉంటుంది. మత ఆధారిత చట్టాల స్థానంలో పెళ్లి, విడాకులు, భరణం, వారసత్వం, దత్తత విషయంలో పౌరులందరికీ ఒకే రూల్స్ వర్తిస్తాయి.


