News December 4, 2024

‘సీజ్ ద షిప్’ పేరిట మూవీ టైటిల్

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోటి వెంట వచ్చిన మాట ఇప్పుడు ఓ సినిమాకు టైటిల్‌గా మారింది. ఇటీవల కాకినాడ పోర్టులో తనిఖీల సందర్భంగా ఆయన ‘సీజ్ ద షిప్’ అనే ఆదేశాలు ఇవ్వడంతో అప్పటినుంచి ఈ వాక్యం వైరలవుతోంది. తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఓ సినీ నిర్మాత రూ.1100 చెల్లించి ‘సీజ్ ద షిప్’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేసుకున్నారు.

Similar News

News March 15, 2026

సన్‌రైజర్స్‌కు పాక్ ప్లేయర్ దూరం?

image

The Hundred టోర్నీ కోసం అబ్రార్(పాక్)ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనడంపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ లీగ్ జులై 21-AUG 16 వరకు కొనసాగనుండగా అదే సమయంలో పాక్ టీమ్ 2 టెస్టుల సిరీస్ కోసం విండీస్‌లో పర్యటించనుంది. అందువల్ల అబ్రార్‌కు పాక్ NOC ఇవ్వకపోవచ్చని, టోర్నీలో ఆడటం అనుమానమేనని సమాచారం. కాగా అతను టోర్నీకి అందుబాటులో ఉంటాడనే కొనుగోలు చేశామని SRH హెడ్ కోచ్ వెటోరీ చెప్పిన విషయం <<19370720>>తెలిసిందే.<<>>

News March 15, 2026

అటామిక్ క్లాక్స్ చెడిపోతే ఏం జరుగుతుంది?

image

నేవిగేషన్ వ్యవస్థలో అటామిక్ క్లాక్స్(పరమాణు గడియారాలు) కీలకం. భూమిపై ఉన్న మనిషి/ప్రదేశం/ వస్తువు స్థానాన్ని అత్యంత కచ్చితత్వంతో గుర్తించడానికి ఇవే ఆధారం. ఇవి 15 బిలియన్ ఏళ్లలో ఒక్క సెకను కూడా తప్పు చూపవు. ప్రస్తుతం నావిక్ వ్యవస్థలోని <<19386461>>ఈ క్లాక్<<>> చెడిపోయింది. దీనివల్ల ఏదైనా వస్తువు అసలు స్థానం నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు చూపుతాయి. నావిక్‌తో అనుసంధానమైన 8,700 రైళ్లకు అంతరాయం ఏర్పడవచ్చు.

News March 15, 2026

ఇలా అయితే SRHకు ఇబ్బందులు తప్పవు: పుజారా

image

SRHలో అభిషేక్, హెడ్, క్లాసెన్ లాంటి విధ్వంసక బ్యాటర్లు ఉన్నప్పటికీ అనేక లోపాలు కనిపిస్తున్నాయని మాజీ క్రికెటర్ పుజారా తెలిపారు. ‘ఆ ముగ్గురు ఔటవగానే జట్టును ముందుకు తీసుకెళ్లే ప్లేయర్ కనపడటం లేదు. దీన్ని ప్రత్యర్థి జట్లు అవకాశంగా మలుచుకుంటున్నాయి. అలాగే SRH హోంగ్రౌండులో మినహా మిగతా మైదానాల్లో ప్రదర్శన పేలవంగా ఉంది. ఈ అంశాలపై మేనేజ్‌మెంట్ దృష్టిసారించకపోతే ఇబ్బందులు తప్పవు’ అని పేర్కొన్నారు.