News December 4, 2024
పేరెంట్స్, టీచర్స్ సమావేశానికి ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు: కలెక్టర్

డిసెంబరు 7న జరిగే మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా విద్యా శాఖాధికారులను ఆదేశించారు. బుధవారం మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం ఏర్పాట్లపై ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్వహణకు సంబంధించి 13 కమిటీలను ఏర్పాటు చేశారా, లేదా అని అడిగి తెలుసుకున్నారు.
Similar News
News January 18, 2026
కర్నూలులో బహిరంగ హెచ్చరిక బ్యానర్లు

కర్నూలు నగరంలో ఆస్తిపన్ను మొండి బకాయిల వసూళ్లను నగరపాలక సంస్థ మరింత కఠినతరం చేస్తోంది. ఈక్రమంలో ‘మేలుకో బకాయిదారుడా!’ అనే శీర్షికతో ఆదివారం హెచ్చరికాత్మక బ్యానర్లను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఈ చర్యలతో అయినా బకాయిదారుల్లో చైతన్యం వచ్చి, స్వచ్ఛందంగా పన్నులు చెల్లించే పరిస్థితి ఏర్పడుతుందన్న ఆశతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే మొండి బకాయిదారుల పట్ల అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
News January 18, 2026
కర్నూలు: చుక్కలు చూపిస్తున్న చికెన్ ధరలు

కర్నూలు జిల్లాలో చికెన్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కోడుమూరు, గోనెగండ్ల, పెద్దకడబూరు, పత్తికొండ, ఆలూరు, ఆస్పరి, ఎమ్మిగనూరు, ఆదోని, దేవనకొండ తదితర మండలాల్లో లైవ్ కిలో రూ.195, స్కిన్ రూ.300, స్కిన్‌లెస్ రూ.310-320 చొప్పున విక్రయిస్తున్నారు. మటన్ కిలో రూ.800-900, చేపలు రూ.180కి అమ్ముతున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి.
News January 17, 2026
రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం: కలెక్టర్

రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా మండల స్థాయిలో కార్యాచరణాత్మక వ్యవసాయ ప్రణాళికలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆదేశించారు. ఈ-క్రాప్ బుకింగ్‌ను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని, వరికి బదులుగా మల్లెపూలు, డ్రాగన్ ఫ్రూట్, బొప్పాయి, అరటి వంటి పంటలను ప్రోత్సహించాలని సూచించారు. పంట సేకరణ, మార్కెటింగ్‌లో రైతులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.


