News December 4, 2024
ఈ నెల 11న జిల్లాల్లో వైసీపీ నిరసనలు: జగన్
AP: ఈ నెల 11న రైతు సమస్యలపై వైసీపీ జిల్లా స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తుందని వైసీపీ చీఫ్ జగన్ తెలిపారు. ప్రజల తరఫున గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని మీడియా సమావేశంలో తెలిపారు. కరెంట్ ఛార్జీల బాదుడును నిరసిస్తూ ఈ నెల 27న ఆందోళన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయమై జనవరి 3న కలెక్టర్ల వద్ద నిరసన చేపడుతామని చెప్పారు.
Similar News
News December 27, 2024
రుణమాఫీకి ఆద్యుడు మన్మోహన్
ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా రైతు రుణమాఫీ అనేది కామన్ హామీగా మారిపోయింది. అయితే ఈ పథకానికి ఆద్యుడు మన్మోహన్ సింగ్. 2008లో యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది రైతులకు రూ.72,000 కోట్ల రుణమాఫీ చేసింది. ఆ డేరింగ్ నిర్ణయం కారణంగానే యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని చాలా పార్టీలు ఎన్నికల్లో గెలుస్తున్నాయి.
News December 27, 2024
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నేడు వైసీపీ పోరుబాట
AP: కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా వైసీపీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద నేతలు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహిస్తారు. కరెంట్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తారు. ప్రజలపై రూ.15,485 కోట్ల భారాన్ని ప్రభుత్వం మోపిందని వైసీపీ ఆరోపిస్తోంది.
News December 27, 2024
వారం రోజులు సంతాప దినాలు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం నేపథ్యంలో కేంద్రం వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసింది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇవాళ కేంద్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించి ఆయనకు సంతాపం తెలపనుంది.