News December 4, 2024

ఆస్ట్రేలియాలో ఫ్యాన్స్‌కు షాకిచ్చిన టీమ్ ఇండియా

image

అడిలైడ్ టెస్టుకు ముందు టీమ్ ఇండియా ప్రాక్టీస్ సెషన్లకు 5వేలమందికి పైగా ఫ్యాన్స్‌ హాజరయ్యారు. భారత క్రికెటర్లను వారిలో పలువురు అసభ్యంగా దూషించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా రోహిత్, పంత్‌ బరువుపై ట్రోల్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో భారత ప్రాక్టీస్ సెషన్లకు ఇకపై అభిమానుల్ని అనుమతించేది లేదని బీసీసీఐ ప్రకటించింది. కాగా.. ఆస్ట్రేలియా ప్రాక్టీస్ సెషన్‌కు 50మంది మాత్రమే రావడం గమనార్హం.

Similar News

News September 17, 2025

పాకిస్థాన్ మ్యాచులకు రిఫరీగా రిచర్డ్‌సన్!

image

ఆసియా కప్: షేక్‌హ్యాండ్ వివాదంలో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ని తొలగించాలని పాకిస్థాన్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను ఆసియా కప్ నుంచి తొలగించకపోతే తాము UAEతో మ్యాచ్ ఆడబోమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాక్ మ్యాచులకు పైక్రాఫ్ట్‌ను ICC దూరం పెట్టినట్లు తెలుస్తోంది. UAEతో మ్యాచ్‌కు రిఫరీగా రిచర్డ్‌సన్‌ను నియమించినట్లు PCB సభ్యుడు చెప్పారని PTI కథనం ప్రచురించింది.

News September 17, 2025

భూమనకు తిరుపతి నేలపై నడిచే అర్హత లేదు: మంత్రి స్వామి

image

AP: తిరుమల విషయంలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి DBV స్వామి అభిప్రాయపడ్డారు. YCP నేత భూమనకు శ్రీవిష్ణువు, శని దేవుని విగ్రహానికి తేడా తెలియదా అని నిలదీశారు. ఆయనకు తిరుపతి నేలపై నడిచే అర్హత లేదని ధ్వజమెత్తారు. వేంకన్న పాదాలు పట్టుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమలపై YCP నేతలు నిత్యం విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేంకన్నతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవన్నారు.

News September 17, 2025

ఒత్తైన జుట్టుకు బియ్యం నీళ్లు

image

ప్రస్తుత కాలంలో జుట్టు రాలే సమస్య పెరిగింది. అయితే హెయిర్‌లాస్ ఎక్కువ ఉంటే బియ్యం కడిగిన నీళ్లతో చెక్ పెట్టొచ్చు. బియ్యం నీటితో మర్దనా చేసుకుంటే మాడు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే అమినో ఆమ్లాలు, విటమిన్‌ బీ, ఈ, సీలు జుట్టు పెరగడానికి సహకరిస్తాయి. అలాగే రాత్రి బియ్యం నానబెట్టిన నీటిని వడకట్టి ఉదయాన్నే తలకు పట్టించి అరగంట తర్వాత కడుక్కోవాలి. ఇలా వారానికోసారి చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.