News June 3, 2024

బెంగళూరులో 133 ఏళ్ల రికార్డు బ్రేక్

image

బెంగళూరులో నిన్న ఒక్కరోజే దాదాపు 111mm వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ నెలలో ఒక్కరోజే ఈ స్థాయి వర్షం కురవడం గత 133 ఏళ్లలో ఇదే తొలిసారి అని తెలిపింది. ఈనెల 1, 2 తేదీల్లో కలిపి మొత్తం 140.7mm వర్షపాతం నమోదైందని, ఏటా జూన్ నెల మొత్తంలో కురిసే సగటు వర్షపాతాన్ని (110.3mm) ఇప్పటికే అధిగమించినట్లు పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించాయని తెలిపింది.

Similar News

News October 10, 2024

నేడు క్యాబినెట్ భేటీ

image

AP: ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం కానుంది. చెత్త పన్ను రద్దు, కొత్త మున్సిపాలిటీల్లో పోస్టుల భర్తీ, దేవాలయాలకు పాలక మండళ్ల నియామకం, ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం వంటి అంశాలపై చర్చించే అవకాశముంది.

News October 10, 2024

టాటా మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

image

చిత్తశుద్ధి, నిజాయితీతో ప్రపంచంపై ముద్ర వేసిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో రతన్ టాటా ఒకరని ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. పరిశ్రమల అభివృద్ధి, సమాజ సేవలో ఆయన భాగస్వామ్యం తరాలకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. టాటా మరణంతో ఇండస్ట్రీ ఐకాన్‌ను కోల్పోయిందని, ఆయనలాగా ఇంకెవ్వరూ ఉండరని టీజీ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. వాణిజ్య రంగానికి రతన్ టాటా ఆదర్శమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాసుకొచ్చారు.

News October 10, 2024

రతన్ టాటా విజయాలివే..

image

అనుభవలేమితో కెరీర్ ప్రారంభంలో రతన్ టాటా అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. వాటినే సోపానాలుగా మలుచుకొని ఛైర్మన్ అయ్యాక తనదైన నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా టాటా గ్రూప్‌ను విస్తరించారు. లండన్ టెట్లీ టీ కొనుగోలు, కార్ల తయారీ సంస్థలు జాగ్వార్, ల్యాండ్ రోవర్‌తో పాటు కోరస్ స్టీల్‌ను టాటాలో భాగం చేశారు. దీంతో పాటు ఐటీ, టెలి కమ్యూనికేషన్స్, ఆటో మొబైల్స్ రంగాల్లోనూ సంస్థను విస్తృతం చేసి సక్సెస్ అయ్యారు.