News July 29, 2024
16 ఏళ్ల అమ్మాయి.. 10 మందికి కొత్త జీవితం ఇచ్చింది

TG: మేడ్చల్‌కు చెందిన శ్రీనివాస్, సరిత దంపతుల కూతురు దీపిక(16) ఈనెల 22న ఫిట్స్ వచ్చి ఇంట్లో కుప్పకూలింది. వెంటనే ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈక్రమంలో దీపికకు బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు బాలిక అవయవాలను ఈనెల 25న దానం చేశారు. 10 మంది జీవితాల్లో దీపిక వెలుగులు నింపింది.
Similar News
News February 24, 2026
ఇంగ్లండ్‌తో పోరు.. పాక్ స్కోరు ఎంతంటే..?

T20 WC సూపర్-8లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో పాక్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 164-9 పరుగులు చేసింది. ఓపెనర్ ఫర్హాన్(63) రాణించగా, బాబర్ ఆజమ్(25), ఫఖర్ జమాన్(25) ఫర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో డాసన్ 3, ఓవర్టన్, ఆర్చర్ తలో 2, రషీద్ ఒక వికెట్ తీశారు.
News February 24, 2026
7 లక్షల మంది ఆస్తిహక్కు పత్రాలు తీసుకోలేదు: అనగాని

AP: పేదలకు ఇళ్ల పేరిట గత ప్రభుత్వంలో ₹6,000 కోట్లు స్వాహా చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ‘22 లక్షల మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తే 7 లక్షల మంది కన్వేయన్స్ డీడ్స్ (ఆస్తిహక్కు పత్రాలు) తీసుకోలేదు. చెరువులు, ముంపు ప్రాంతాల్లో స్థలాలివ్వడంతో 2.5 లక్షల మంది అసలు పట్టాలే తీసుకోలేదు. తీసుకున్న వారిలో 43,948 మంది అనర్హులున్నారు. మరో 1,11,037 పట్టాలను పరిశీలిస్తున్నాం’ అని తెలిపారు.
News February 24, 2026
‘టెర్రర్’ ఆరోపణలు.. టెలిగ్రామ్ ఫౌండర్‌పై రష్యా దర్యాప్తు

టెర్రరిజం యాక్టివిటీలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలతో టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ దురోవ్‌పై రష్యా దర్యాప్తు ప్రారంభించింది. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ప్రభుత్వ పత్రిక Rossiyskaya Gazeta తెలిపింది. వెస్టర్న్, ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్‌తో యాప్ రాజీపడినట్లు ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ రిపోర్టు ఇచ్చిందని పేర్కొంది. రూల్స్ ఉల్లంఘిస్తున్న టెలిగ్రామ్‌ను స్లోడౌన్ చేస్తామని ఇటీవల రష్యా హెచ్చరించింది.


