News March 29, 2024

KKRలోకి 16 ఏళ్ల టీనేజర్

image

కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఆటగాడు ముజీబ్ ఉర్ రెహ్మాన్ గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమయ్యారు. దీంతో అతడి స్థానాన్ని అఫ్గానిస్థాన్ యంగ్ స్పిన్నర్ అల్లాహ్ ఘజన్‌ఫర్‌తో KKR భర్తీ చేసింది. 16 ఏళ్ల ఘజన్‌ఫర్‌ను బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకే దక్కించుకుంది. మరోవైపు ప్రసిధ్ కృష్ణ స్థానంలో కేశవ మహరాజ్‌ను తీసుకున్నట్లు రాజస్థాన్ రాయల్స్ ప్రకటించింది. రూ.50 లక్షల బేస్ ప్రైజ్‌కు తీసుకుంది.

Similar News

News April 10, 2026

ఇరాన్‌ కొత్త నాయకత్వం ఇంకా డేంజర్: IDF

image

ఇరాన్‌లో ఇప్పుడున్న నాయకత్వం మరింత ఎక్స్‌ట్రీమ్‌గా ఉందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(IDF) హెచ్చరించింది. ఖమేనీ చనిపోయిన తర్వాత ఏర్పడిన కొత్త లీడర్‌షిప్ సంప్రదాయ మత పెద్దల నుంచి కాకుండా IRGC నుంచి వచ్చిందని తెలిపింది. ఈ మేరకు రహస్య సమావేశంలో IDF ప్రతినిధులు పార్లమెంటు ఫారిన్ అఫైర్స్ కమిటీకి తెలియజేశారు. ఈ క్రమంలో యుద్ధం తిరిగి ప్రారంభం కావచ్చని కమిటీ చీఫ్ బోవజ్ బిస్ముత్ అభిప్రాయపడ్డారు.

News April 10, 2026

IPL: రాత్రి 8.15 గంటలకు మ్యాచ్ ప్రారంభం

image

IPL అభిమానులకు గుడ్‌న్యూస్. RCB-RR మ్యాచ్ జరగాల్సిన గువాహటి స్టేడియం వద్ద వర్షం తగ్గింది. సిబ్బంది కవర్లు తొలగించారు. ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అంపైర్లు రా.8 గంటలకు టాస్ వేయనున్నారు. రా.8.15 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. పూర్తి ఓవర్ల గేమ్ జరగనుంది.

News April 10, 2026

మెలానియా ప్రకటన.. టైమింగ్ వెనక పెద్ద ప్లాన్?

image

మెలానియా సడన్‌గా ఎప్‌స్టీన్ గురించి <<19611865>>మాట్లాడటం<<>> వెనక అనేక థియరీలు వినిపిస్తున్నాయి. ఆమె ప్రసంగంలో ఎక్కడా ట్రంప్‌ను సమర్థించకపోవడంతో విడాకుల రూమర్లు వస్తున్నాయి. మరోవైపు ఇరాన్ యుద్ధంలో ట్రంప్ విఫలమవుతుండటంతో ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ ప్లాన్ చేశారనే వాదనలు ఉన్నాయి. త్వరలో విడుదల కానున్న ఎప్‌స్టీన్ రహస్య ఈమెయిల్స్ ద్వారా ఏదైనా పెద్ద విషయం బయటకొస్తుందనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.