News August 29, 2025
20 బంతులేసేందుకు 34,000 కి.మీ జర్నీ!

ది హండ్రెడ్ మెన్స్ లీగ్‌లో వరుసగా మూడోసారి ఓవల్ ఇన్విన్స్‌బుల్స్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ సీజన్‌లో రాణించిన బౌలర్ రషీద్ ఖాన్ జాతీయ జట్టుకు ఆడేందుకు లీగ్‌ను వీడారు. అతడి స్థానంలో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపాను రీప్లేస్ చేసుకుంది. కాగా జంపా ఫైనల్లో 20 బంతులు వేసేందుకు ఆస్ట్రేలియా నుంచి ఇంగ్లండ్‌కు రానుపోను 34,000 కి.మీ ప్రయాణించనున్నారు. ఈ నెల 31న లార్డ్స్‌లో జరగబోయే ఫైనల్లో జంపా బరిలోకి దిగుతారు.
Similar News
News August 29, 2025
రుషికొండ ప్యాలెస్‌పై మంత్రులతో కమిటీ

AP: రుషికొండ ప్యాలెస్‌ను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ముగ్గురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ సభ్యులుగా కందుల దుర్గేశ్, పయ్యావుల కేశవ్, డీబీవీ స్వామిని నియమించింది. వీరు ఈ రిసార్ట్‌ను ఎలా వినియోగించాలనే దానిపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనున్నారు. ఆ నివేదిక ప్రకారం సర్కార్ చర్యలు తీసుకుంటుంది.
News August 29, 2025
డెడ్ ఎకానమీ కాదు ట్రంప్.. గుడ్ ఎకానమీ!

ఇండియాది డెడ్ ఎకానమీ అంటూ హేళనగా మాట్లాడిన ట్రంప్‌కు భారత <<17555786>>GDP<<>> దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. 2025-26 FYలో Q1లో భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధిని నమోదు చేసింది. 2025 Q1లో US గ్రోత్ రేటు -0.5. అటు చైనా 5.2% వృద్ధిని సాధించింది. భారత వ్యవసాయ, ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్ రంగాలు రాణించాయి. IND ఎగుమతులపై ఆధారపడిన దేశం కాదని, టారిఫ్స్ విధించినా పెద్దగా నష్టం ఉండదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
News August 29, 2025
ఆ వీడియోలో ఉన్నవాళ్లంతా టీడీపీనే: వైసీపీ

AP: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే <<17554192>>కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి<<>> హత్య ప్లాన్‌లో ఉన్నదంతా టీడీపీ కార్యకర్తలేనని వైసీపీ ట్వీట్ చేసింది. వారంతా కోటంరెడ్డి బ్రదర్స్, రూప్ కుమార్ అనుచరులేనని కౌంటరిచ్చింది. ఉద్దేశపూర్వకంగానే కోటంరెడ్డి మర్డర్ ప్లాన్ అంటూ వీడియో క్రియేట్ చేశారని ఆరోపించింది. జగదీశ్, వినీత్, మహేశ్ టీడీపీ కార్యకర్తలేనని నాయకులతో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది.