News March 21, 2024

కోకాపేటలో 63 అంతస్తుల భవనం

image

TG: ఆకాశమే హద్దుగా అన్నట్లు హైదరాబాద్‌లో భవన నిర్మాణాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తాజాగా కోకాపేటలో 63 అంతస్తులతో ఓ భారీ భవనం నిర్మించేందుకు బిల్డర్లు ప్రయత్నిస్తున్నారు. డిజైన్లు, స్థలం ఎంపిక పూర్తయ్యాక అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 59 అంతస్థులతో పుప్పాల్‌గూడలో క్యాండూర్ స్కైలెన్, 58 అంతస్తులతో సాస్‌క్రౌన్ పేరుతో జరుగుతున్న నిర్మాణాలే టాప్.

Similar News

News January 8, 2025

విమెన్ బాడీ స్ట్రక్చర్‌పై కామెంట్లు సెక్సువల్ హరాస్‌మెంటే: హైకోర్టు

image

విమెన్ బాడీ స్ట్రక్చర్‌పై కామెంట్లు చేయడం లైంగిక నేరం కిందకే వస్తుందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. KSEBలోని మహిళా ఉద్యోగి పెట్టిన కేసును క్వాష్ చేయాలని మాజీ ఉద్యోగి వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. 2013 నుంచి అతడు వల్గర్‌గా మాట్లాడుతూ అసభ్య మెసేజులు పంపిస్తూ కాల్స్ చేసేవాడు. బాడీ స్ట్రక్చర్‌పై కామెంట్లు నేరం కాదని అతడు వాదించగా, మహిళ చూపిన సందేశాల్లో నేర ఉద్దేశం కనిపిస్తోందని కోర్టు ఏకీభవించింది.

News January 8, 2025

గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ నిర్మాతలకు షాక్

image

AP: గేమ్ ఛేంజర్, <<15068245>>డాకు మహారాజ్<<>> సినిమాల టికెట్ రేట్ల పెంపును 10 రోజులకు పరిమితం చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. 14 రోజుల వరకు <<15065900>>టికెట్ రేట్ల పెంపునకు<<>> ప్రభుత్వం అనుమతినివ్వగా, దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.

News January 8, 2025

భక్తులు మాస్కులు ధరించాలి: TTD ఛైర్మన్

image

AP: జనవరి 10-19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు ఏర్పాట్లు చేసినట్లు TTD ఛైర్మన్ BR నాయుడు చెప్పారు. 10న ఉ.4:30కు ప్రొటోకాల్, వైకుంఠ ఏకాదశి రోజు ఉ.8గంటలకు సర్వదర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. ‘అన్ని ప్రత్యేక దర్శనాలను 10రోజులు రద్దు చేశాం. టికెట్లు లేకుండా తిరుమల వచ్చి ఇబ్బందులు పడొద్దు. 3K CC కెమెరాలతో నిఘా ఉంచాం. hMPV అలజడి నేపథ్యంలో భక్తులు మాస్క్ లాంటి స్వీయ జాగ్రత్తలు పాటించాలి’ అని ఛైర్మన్ కోరారు.