News April 3, 2024

12 ఏళ్ల బాలికను పెళ్లాడిన 63 ఏళ్ల వృద్ధుడు

image

పశ్చిమ ఆఫ్రికాలోని ఘనాలో దారుణం చోటుచేసుకుంది. 12 ఏళ్ల బాలికను 63 ఏళ్ల వృద్ధుడు వివాహం చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 30న వీరి వివాహం జరగగా అభం శుభం తెలియని బాలికను పెళ్లి చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. అయితే కన్యను పెళ్లి చేసుకోవాలనే పాత ఆచారం ప్రకారం వివాహం జరిగిందని ఈ వేడుకకు హాజరైన ఓ అతిథి వివరించాడు. ఈ ప్రాంతంలో ఈ విధానం సర్వసాధారణమని చెప్పడం గమనార్హం.

Similar News

News April 21, 2025

అథ్లెటిక్స్ జట్టు కోచ్‌ రమేశ్‌పై సస్పెన్షన్ వేటు

image

జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ జట్టు కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్‌ను ‘నాడా’ సస్పెండ్ చేసింది. ఆయనతో పాటు తెలుగు అథ్లెట్లు శ్రీనివాస్, ప్రత్యూష సహా మొత్తం ఏడుగురిపై వేటు వేసింది. క్రీడాకారులు డోపింగ్ టెస్టులకు శాంపిల్స్ ఇవ్వకుండా రమేశ్ సహకరించినట్లు ఆరోపణలున్నాయి. దీంతో విచారణ అనంతరం నాడా ఈ చర్యలు చేపట్టింది. తాను ఏ తప్పూ చేయలేదని, తప్పు చేసేవారిని ప్రోత్సహించలేదని రమేశ్ తెలిపారు.

News April 21, 2025

కాసేపట్లో భారత్‌కు వాన్స్

image

US ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు ఉ.9.30 గంటలకు ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కానున్నారు. ఆయన భార్య ఉషా వాన్స్, పిల్లలు ఇవాన్, వివేక్, మీరాబెల్‌లతో కలిసి 4 రోజుల పాటు దేశంలో పర్యటిస్తారు. ఢిల్లీ అక్షర్‌ధామ్ ఆలయం, హస్తకళల మార్కెట్‌ను సందర్శించాక సా.6.30 గంటలకు PM మోదీతో భేటీ అవుతారు. ధ్వైపాక్షిక చర్చల అనంతరం వాన్స్ దంపతులకు మోదీ విందు ఇస్తారు. ఇవాళ రాత్రికి రాజస్థాన్ పర్యటనకు వెళ్తారు.

News April 21, 2025

నాని సినిమాల్లో ‘HIT 3’ రికార్డు

image

నేచురల్ స్టార్ నాని నటించిన ‘HIT-3’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే USAలో బుకింగ్స్ ప్రారంభం కాగా ఇప్పటివరకు $75K వసూళ్లు సాధించింది. ఈ సినిమా ఈనెల 30న విడుదల కానుండగా, 10 రోజుల ముందే ఈ ఫీట్‌ను సాధించింది. దీంతో నాని కెరీర్‌లో అత్యంత వేగంగా $75K మార్కును చేరుకున్న సినిమాగా నిలిచింది. అలాగే ఫాస్టెస్ట్ 1 మిలియన్ డాలర్స్ ప్రీ సేల్స్‌ రికార్డునూ సాధించనుంది.

error: Content is protected !!