News September 27, 2024
గ్రేటర్లో వాటిపై నిషేధం విధించిన ఆమ్రపాలి

TG: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ పరిధిలో గోడలపై పోస్టర్లు, పెయింటింగ్స్, వాల్ రైటింగ్స్ వేయడంపై నిషేధం విధించారు. అనుమతులు లేకుండా ఏమైనా చేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. సినిమా వాళ్లు సైతం అనుమతులతో వాల్ పోస్టర్లు వేయాలన్నారు. ఈ అంశంపై లోకల్ ప్రింటర్స్తో మాట్లాడాలని డిప్యూటీ కమిషనర్లను ఆమె ఆదేశించారు.
Similar News
News December 9, 2025
గెడ్డపాలెంలో బయటపడిన బౌద్ధ పురావస్తు ప్రాంతం

ఎస్.రాయవరం గెడ్డపాలెం సమీపంలో క్రీ.శ 6వ శతాబ్దానికి చెందిన బౌద్ధ పురావస్తు ప్రాంతం బయటపడింది. ఇక్కడ రాతితో చెక్కిన శిల్పాలు, గుహలను పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. అప్పటి శిల్ప కళానైపుణ్యం, ప్రత్యేకత ఉట్టిపడేలా బయటపడిన శిల్పసంపద బౌద్ధ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి. రాంబిల్లి మండలం కొత్తూరు వద్ద బౌద్ధమతం ఆనవాళ్లు గుర్తించగా, గెడ్డపాలెంలో కూడా బౌద్ధ ఆనవాళ్లు వెలుగు చూడడం విశేషం.
News December 9, 2025
అపార్ ఐడి పురోగతిని వేగవంతం చేయాలి: కలెక్టర్

పలు మండలాల్లో అపార్ ఐడి పురోగతి చాలా నెమ్మదిగా ఉందని వాటిని వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం ఆమె అధికారులకు సూచనలు సలహాలు చేశారు. మహానంది పగిడాల బేతంచెర్ల జూపాడుబంగ్లా శ్రీశైలం మండలాలలో చాలా తక్కువగా ఉందని వెల్లడించారు. విద్యాశాఖ 95 శాతం లక్ష్యాన్ని సాధించే విధంగా మరింత కృషి చేయాలని సూచించారు.