News September 18, 2024
‘ప్రకాశం’లో వైసీపీకి భారీ కుదుపు

AP: మాజీ మంత్రి, జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామాతో ప్రకాశం జిల్లాలో YCP భారీ కుదుపునకు గురైంది. ఆ జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న బాలినేని తప్పుకోవడంతో YCP చుక్కాని లేని నావలా తయారైంది. జిల్లా రాజకీయాలను కనుసైగతో శాసించిన ఆయన ఆ పార్టీని వీడడం YCPకి తీరని లోటే. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తనకంటూ సొంత కోటరీ ఏర్పాటు చేసుకున్న బాలినేని గుడ్ బై చెప్పడం ఆ పార్టీకి బిగ్ మైనస్.
Similar News
News January 21, 2026
తెలంగాణకు భారీ పెట్టుబడులు

TG: రాష్ట్రంలో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు DI పైపుల తయారీ సంస్థ రష్మి గ్రూప్ ముందుకు వచ్చింది. దావోస్లో CM రేవంత్ బృందంతో ₹12,500Cr పెట్టుబడికి MOU చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 12K ఉద్యోగాలు వచ్చే అవకాశముంది. అటు ₹6వేల కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్ట్ అభివృద్ధికి ‘న్యూక్లర్ ప్రొడక్ట్స్’ సంస్థ ప్రభుత్వానికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమర్పించింది.
News January 21, 2026
NBCC 59 పోస్టులకు నోటిఫికేషన్

నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (<
News January 21, 2026
అక్రమాలకు కేంద్రంగా సింగరేణి: కిషన్రెడ్డి

TG: అవినీతి, అక్రమాలకు సింగరేణి కేంద్రంగా మారిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. BRS, కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణిని బంగారు బాతులా వాడుకున్నాయని విమర్శించారు. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలకు బొగ్గు అందించాలనే నైనీ కోల్బ్లాక్ను కేంద్రం కేటాయించిందన్నారు. కేంద్రం అనుమతులిచ్చినా టెండర్లు పూర్తి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, సింగరేణి అక్రమాలపై CBI విచారణ అవసరమని తెలిపారు.


