News October 17, 2024

ఎలక్షన్ కమిషనర్‌కు తప్పిన పెను ప్రమాదం

image

కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడటంతో పైలట్ పిథోరాగఢ్ జిల్లాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. హెలికాప్టర్‌లో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు.

Similar News

News October 17, 2024

1.5 మిలియన్ డాలర్లకు అమ్ముడైన ‘GOT’ సింహాసనం

image

గేమ్ ఆఫ్ థ్రోన్స్(GOT) సిరీస్ చూసిన వారికి అందులోని కత్తులతో కూడిన ఐరన్ థ్రోన్ ఎంత కీలకమో తెలిసే ఉంటుంది. ఆ షో అంతా సింహాసనంపై ఆధిపత్యం కోసమే సాగుతుంది. ఐరన్ థ్రోన్‌కు ఉన్న ఫ్యాన్స్ సంఖ్య తక్కువేం కాదు. ఈ నేపథ్యంలో దానికి ఇటీవల నిర్వహించిన వేలంలో ఓ అజ్ఞాత వ్యక్తి ఏకంగా 1.5 మిలియన్ డాలర్లకు దక్కించుకున్నాడు. వేలం సంస్థ హెరిటేజ్ ఆక్షన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది.

News October 17, 2024

సానియా మీర్జా మళ్లీ పెళ్లి.. నిజమెంత?

image

పాక్ మాజీ క్రికెటర్ మాలిక్ నుంచి విడాకులు తీసుకున్న సానియా మీర్జా మరోసారి పెళ్లి చేసుకున్నారా? సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. సనా జావేద్ అనే నటిని మాలిక్ రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమె మాజీ భర్త ఉమైర్ జస్వాల్‌కు తాజాగా వివాహం కాగా, అతడు పెళ్లాడింది సానియానేనంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే, సానియా పిల్లలతో కలిసి దుబాయ్‌లో ఉన్నారని.. ఆ వార్తలన్నీ అవాస్తవమని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

News October 17, 2024

VIPలకు NSG భద్రత కట్

image

దేశంలోని వీఐపీలకు ఎన్‌ఎస్‌జీ భద్రతను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై వీరి భద్రతను సీఆర్‌పీఎఫ్ పర్యవేక్షిస్తుందని తెలుస్తోంది. జెడ్ ప్లస్ కేటగిరిలో చంద్రబాబు, యోగి ఆదిత్యనాథ్, అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్, మాయావతి, సర్బానంద సోనోవాల్, అజాద్, ఫరూక్ అబ్దుల్లాకు భద్రత ఉపసంహరించనున్నారు. వీరి సెక్యూరిటీని CRPF చూసుకుంటుంది.