News November 8, 2024
46 రోజుల్లో భూమిని చుట్టేసే పక్షి!
ఆల్బట్రాస్ అనే పక్షి భూమిని 46 రోజుల్లోనే చుట్టి వస్తుంది. బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే పేరిట పక్షి జాతుల పరిశోధకులు 2005లో వీటిపై అధ్యయనం నిర్వహించారు. ఆ జాతికి చెందిన 22 పక్షులకు ట్రాకింగ్ పరికరాల్ని అమర్చి వాటి వలస మార్గాల్ని ట్రాక్ చేశారు. దక్షిణ అట్లాంటిక్‌లోని దక్షిణ జార్జియా నుంచి వలసకు బయలుదేరిన ఆల్బట్రాస్లలో కొన్ని పక్షులు 46 రోజుల్లో భూమిని చుట్టి వచ్చినట్లు ఆ అధ్యయనంలో తేలింది.
Similar News
News November 9, 2024
మృతుల్లో అత్యధికులు వారే.. UN ఆందోళన
ఇజ్రాయెల్ భీకర దాడుల్లో అసువులు బాస్తున్న పాలస్తీనియన్లలో అత్యధికులు చిన్నారులు, మహిళలే ఉన్నట్టు UN మానవ హక్కుల సంఘం లెక్కగట్టింది. Nov 2023-Apr 2024 మధ్య మృతి చెందిన 8,119 మందిలో 44% చిన్నారులు, 26% మహిళలు ఉండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. మృతుల్లో 80% నివాస సముదాయాల్లోని వారే ఉన్నట్టు తెలిపింది. గత 13 నెలలుగా జరుగుతున్న ఈ యుద్ధంలో 43,300 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు.
News November 9, 2024
ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న నగరాలు
1.టోక్యో (జపాన్)- 3.71 కోట్లు
2.ఢిల్లీ (భారత్)- 3.38 కోట్లు
3.షాంఘై (చైనా)- 2.99 కోట్లు 4.ఢాకా (బంగ్లాదేశ్)- 2.3 కోట్లు
5.సౌ పౌలో (బ్రెజిల్)- 2.28 కోట్లు 6.కైరో (ఈజిప్ట్)- 2.26 కోట్లు
7.మెక్సికో సిటీ (మెక్సికో)- 2.25 కోట్లు
8.బీజింగ్ (చైనా)- 2.21 కోట్లు
9.ముంబై (ఇండియా)- 2.16 కోట్లు
10. ఒసాకా (జపాన్)- 1.89 కోట్లు
**హైదరాబాద్ 1.10 కోట్ల జనాభాతో 32వ స్థానంలో ఉంది.
News November 9, 2024
టెస్టు సిరీస్ ఓటమి: 6 గంటల పాటు మీటింగ్!
స్వదేశంలో భారత్ న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ వైట్‌వాష్‌కి గురవ్వడాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంది. కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్, సెలక్టర్ అజిత్ అగార్కర్, బోర్డు పెద్దలు జై షా, రోజర్ బిన్నీ మధ్య 6 గంటల పాటు సుదీర్ఘంగా మీటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. రోహిత్, గంభీర్‌కు బిన్నీ, షా పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ప్రధానంగా ఓటమికి కారణాలపై చర్చ జరిగిందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.