News July 15, 2024
స్కూల్లో బ్రిలియంట్ స్టూడెంట్.. కానీ!

డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులకు తెగబడి పోలీసుల చేతిలో హతమైన నిందితుడు ఓ 20ఏళ్ల కుర్రాడు. బ్రిలియంట్ స్టూడెంట్ అయిన థామస్ మ్యాథ్యూ క్రూక్స్‌కు మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో అవార్డులు వచ్చాయట. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడే అతను రాజకీయాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదని క్లాస్మేట్స్ తెలిపారు. బాల్యంలో సరిగ్గా కాల్చలేకపోవడంతో క్రూక్స్‌కు స్కూల్ షూటింగ్ క్లబ్లో చోటు దక్కనట్లు తెలుస్తోంది.
Similar News
News December 1, 2025
13,217 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

రీజినల్ రూరల్ బ్యాంకుల్లో 13,217 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ పరీక్షల అడ్మిట్ కార్డులను IBPS విడుదల చేసింది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 6, 7, 13, 14 తేదీల్లో ఆన్లైన్లో పరీక్షలు జరుగుతాయి. కాగా ప్రస్తుతం ఉచిత మాక్ టెస్టులు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
వెబ్సైట్: https://www.ibps.in/
News December 1, 2025
మనకోసం మనకంటే ముందుగా (1/2)

మనిషి స్పేస్ జర్నీ ఈజీ చేసేందుకు మనకంటే ముందు కొన్ని ప్రాణులు స్పేస్‌లోకి వెళ్లాయి. 1947లో USA సైంటిస్ట్స్ ఫ్రూట్ ఫ్లైస్(ఓ జాతి ఈగ)ను పంపారు. రేడియేషన్, జీవక్రియ, ప్రత్యుత్పత్తి తదితరాలపై రీసెర్చ్ కోసం పంపిన అవి తిరిగొచ్చాయి. 1949లో కోతిని పంపగా పారాచూట్ ఫెయిలై వెనక్కి రాలేదు. 1957లో స్పుత్నిక్2లో వీధి కుక్క లైకాను రష్యా పంపింది. భూ కక్ష్యలో అడుగుపెట్టిన తొలి జంతువు ఆ వెదర్లో కొంతసేపే బతికింది.
News December 1, 2025
మనకోసం మనకంటే ముందుగా (2/2)

1960లో స్పుత్నిక్5తో వెళ్లిన డాగ్స్ బెల్కా, స్ట్రెల్కా తిరిగొచ్చాయి. మనుషులు స్పేస్ జర్నీ చేయగలరని వీటితోనే తెలిసింది. 1961లో నాసా ఓ చింపాంజీని పంపి మెదడు పనితీరు పరిశీలించింది. నరాల పనితీరుపై అధ్యయనం కోసం France 1963లో పిల్లిని, 2007లో యురోపియన్ స్పేస్ ఏజెన్సీ వాటర్ బేర్‌ను పంపింది. స్పేస్‌లో ఆక్సిజన్ కొరత, రేడియేషన్‌ను ఇవి తట్టుకున్నాయి.
-1961: యూరి గగారిన్ స్పేస్‌లోకి వెళ్లిన తొలి మనిషి


