News June 27, 2024

‘క్యాబ్ డ్రైవర్ సంపాదన రోజుకు ₹4వేలు’.. నెటిజన్లు షాక్

image

బెంగళూరులో ఓ క్యాబ్ డ్రైవర్ రోజుకు ₹4వేల వరకు సంపాదిస్తున్నాడని ఓ యూజర్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలైంది. ‘ఇటీవల ఫంక్షన్ నుంచి ఓలా క్యాబ్‌లో ఇంటికి వెళ్తుండగా సంపాదన గురించి డ్రైవర్‌ను ఆరా తీస్తే రోజుకు ₹3-4వేలు వస్తుందని చెప్పాడు. నెలలో 25 రోజులు పనిచేస్తూ రోజుకు కనీసం ₹3వేలు వచ్చినా నెలకు అది ₹75వేలు అవుతుంది. ఇది కాకుండా ఇతనికి మరో ఓలా క్యాబ్ ఉంది’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Similar News

News December 27, 2024

దేశం గొప్ప నేతను కోల్పోయింది: ప్రధాని మోదీ

image

మాజీ ప్రధాని మన్మోహన్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అత్యంత గొప్ప నాయకుల్లో ఒకరైన నేతను దేశం కోల్పోయిందన్నారు. నిరాడంబరమైన మూలాల నుంచి ఎదిగి గౌరవనీయమైన ఆర్థికవేత్తగా ఎదిగారని కొనియాడారు. మన ప్రధానిగా ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆయన విస్తృతంగా కృషి చేశారని ప్రశంసించారు.

News December 27, 2024

మాటలు తక్కువ.. పని ఎక్కువ

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు చెప్పగానే ‘ఆయన అసలేం మాట్లాడరు’ అని అంతా అంటుంటారు. అవును నిజమే. చాలామంది రాజకీయ నేతల్లా ఆయన మాటలు చెప్పే వ్యక్తి కాదు. చేతల్లో పని చూపించే నేత. 1991 నుంచి 1996 వరకు దేశ ఫైనాన్స్ మినిస్టర్‌గా పనిచేసిన మన్మోహన్.. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఆయన హయాంలోనే అత్యధిక జీడీపీ 10.2శాతం వృద్ధిరేటు నమోదైంది. వెనుకబడిన వర్గాలకు 27శాతం సీట్ల కేటాయింపు జరిగింది.

News December 27, 2024

ప్రజలకు ‘ఉపాధి’ కల్పించింది ఆయనే..

image

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల‌కు పని క‌ల్పిస్తున్న ఉపాధి హామీ ప‌థ‌కాన్ని మ‌న్మోహ‌న్ సింగ్ హయాంలోనే ప్రారంభించారు. 1991లో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలను ప్రధానిగా ఆయన కొనసాగించారు. తద్వారా విదేశీ పెట్టుబడులు, ప్రైవేటీకరణ, లైసెన్సింగ్ విధానాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అమెరికాతో అణు ఒప్పందం, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, స‌మాచార హ‌క్కు చ‌ట్టం వంటి కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు పునాది వేశారు.