News November 30, 2024

నేడు స్కూళ్ల బంద్‌కు పిలుపు

image

TG: నేడు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల బంద్‌కు SFI, AISF, PDSU లాంటి వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో నాణ్యతలేని ఆహారం కారణంగా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు వెలుగుచూస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్లిష్టమైన సమస్యలను హైలైట్ చేయడమే ఈ బంద్ లక్ష్యమని తెలిపాయి. వెంటనే విద్యాశాఖకు మంత్రిని నియమించాలని డిమాండ్ చేశాయి.

Similar News

News November 30, 2024

రైతుబంధు, బోనస్.. ఏది మంచిది?

image

TG: రైతుబంధు, బోనస్.. ఈ రెండింట్లో ఏది మంచిదనే దానిపై చర్చ జరుగుతోంది. పంట వేయడానికి ముందు పెట్టుబడి సాయం గత ప్రభుత్వం ఏడాదికి ఎకరాకు రూ.10వేలు ఇచ్చింది. దీని ద్వారా అవసరమైన సమయానికి రైతు చేతికి డబ్బులు అందుతాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నరకం వరి క్వింటా రూ.3వేలు పలుకుతుండగా, రూ.500 బోనస్ ఇస్తోంది. ఎకరాకు 20-24 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తే అదనంగా రూ.10-12వేలు వస్తాయి.

News November 30, 2024

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 62,417 మంది భక్తులు దర్శించుకోగా 23,096 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు చేకూరింది.

News November 30, 2024

వికారాబాద్ జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్.. భూసేకరణకు నోటిఫికేషన్

image

TG: వికారాబాద్ జిల్లాలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దుద్యాల మండలం పోలేపల్లిలో ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం లగచర్లలో 110.32 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాల భూమిని సేకరించనుంది. కాగా లగచర్లలో ఫార్మా విలేజ్ కోసం గతంలో ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం నిన్న రద్దు చేసింది.