News August 19, 2024

ఎల్లుండి భారత్ బంద్‌కు పిలుపు

image

SC వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ AUG 21న భారత్ బంద్‌కు SC వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపునిచ్చింది. ఈ తీర్పుతో తమ హక్కులకు భంగం వాటిల్లుతోందని సమితి కన్వీనర్ సర్వయ్య, కో-కన్వీనర్ చెన్నయ్య అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న ఈ తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్లుండి జరిగే బంద్‌లో SC, ST సంఘాలు, ఉద్యోగ, విద్యార్థి, మహిళలు పాల్గొనాలని కోరారు.

Similar News

News December 1, 2025

13,217 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

image

IBPS రీజినల్ రూరల్ బ్యాంక్‌లో 13,217 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్/రూల్ నంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 6, 7, 13, 14తేదీల్లో సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. వెబ్‌సైట్: https://www.ibps.in/

News December 1, 2025

మేడారం పనుల్లో నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించండి: CM

image

TG: మేడారం అభివృద్ధి పనులు నిర్దేశిత స‌మ‌యంలో పూర్తి కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అభివృద్ధి పనులపై ఆయన అధికారులతో సమీక్షించారు. ‘అభివృద్ధి పనుల్లో ఆచార‌ సంప్ర‌దాయాలు, నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించాలి. పొర‌పాట్లు దొర్లితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం. రాతి ప‌నులు, ర‌హ‌దారులు, గ‌ద్దెల చుట్టూ రాక‌పోక‌ల‌కు మార్గాలు, భ‌క్తులు వేచి చూసే ప్ర‌దేశాలు ఇలా ప్ర‌తి అంశంపై CM అధికారుల‌కు సూచ‌న‌లు చేశారు.

News December 1, 2025

సజ్జ రైతులకు దక్కని మద్దతు ధర

image

AP: సజ్జలను పండించిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. అక్టోబరులో మొంథా తుఫాన్ వల్ల కురిసిన వర్షాలకు పంట నాణ్యత, దిగుబడి తగ్గింది. చేతికొచ్చిన పంటనైనా అమ్ముకుందామంటే రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. క్వింటాలుకు మద్దతు ధర రూ.2,775గా ఉంటే.. నాణ్యత సరిగా లేదని రూ.1800 కూడా దక్కని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 64 వేల ఎకరాల్లో సజ్జలను సాగు చేశారు.