News March 29, 2024
టెస్లాకు పోటీగా షావోమీ నుంచి కారు!

ఇతర బ్రాండ్స్తో పోలిస్తే తక్కువ ధరలో మంచి స్మార్ట్ ఫోన్లు అందించే షావోమీ సంస్థ ఇప్పుడు కార్ల తయారీలోకి దిగింది. టెస్లా, బీవైడీ వంటి వాటికి పోటీగా తమ తొలి విద్యుత్ కారు ‘స్పీడ్ అల్ట్రా 7’ను మార్కెట్లోకి తెచ్చింది. నిన్నటి నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యాయి. 3 వేరియెంట్లలో లభించే ఈ కారు ప్రారంభ ధర రూ.25 లక్షలుగా ఉంది. ప్రస్తుతానికి చైనాకే పరిమితమైనా త్వరలోనే భారత్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Similar News
News October 31, 2025
వృద్ధాప్యంలో ఒంటరితనం వేధిస్తోందా?

వృద్ధాప్యంలో ఒంటరితనం అతి పెద్ద సమస్య. పిల్లలు ఎక్కడో దూరంగా ఉండడం, ఏమైనా అయితే పిల్లలు రాగలరో లేరో అనీ కలవరపడతారని నిపుణులు చెబుతున్నారు. ఒంటరితనంతో గతం గురించి ఆలోచిస్తూ కుంగుబాటుకూ లోనవుతారు. రోజూ కాసేపు ధ్యానం చేయడం, స్నేహితులు, బంధువులతో సమయం గడపడం వంటివి మేలు చేస్తాయంటున్నారు. మనసును ఉల్లాసంగా ఉంచుకుంటే ఒంటరిననే భావన తగ్గుతుందని చెబుతున్నారు.
News October 31, 2025
యాచకురాలి దగ్గర నోట్ల కట్టలు!

కర్ణాటకలోని మంగళూరులో మానసిక అనారోగ్యంతో ఉన్న ఓ యాచకురాలు 13 ఏళ్లుగా చెత్త కుప్పల దగ్గర నివసిస్తోంది. ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు స్థానికులు ప్రయత్నించగా చెత్తలో ఉన్న సంచులను గట్టిగా పట్టుకుంది. అనుమానంతో వాటిని తెరిచి చూస్తే భారీగా నోట్లు, నాణేలు కనిపించాయి. వాటిని లెక్కిస్తే ₹లక్ష కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యాచకురాలిని అనాథ శరణాలయానికి తరలించారు.
News October 31, 2025
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

TG: ఇంటర్ బోర్డు పరీక్షల <


