News April 22, 2024
లారీ కిందకు దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి

TG: రోడ్డుపై సిగ్నల్ వేయకుండా వాహనాలు ఆపొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా కొందరు పట్టించుకోకపోవడంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లాలో అదే తరహాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. అతి వేగం ధాటికి ఆ కారు లారీ కిందకు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మునగాల మండలం ముకుందాపురం వద్ద ఈ ఘటన జరిగింది.
Similar News
News April 9, 2026
IMDb టాప్-5 బెస్ట్ IPL మ్యాచులివే..

ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్ IMDb.. IPLలో టాప్-5 మ్యాచుల జాబితాను విడుదల చేసింది.
టాప్-1: 2019 MI-CSK థ్రిల్లింగ్ ఫైనల్ మ్యాచ్
టాప్-2: 2023లో GTపై KKR ప్లేయర్ రింకూ సింగ్ 5 సిక్సర్లు బాదిన గేమ్
టాప్-3: 2014లో RR విధించిన 190 రన్స్ టార్గెట్‌ను MI 14.4 ఓవర్లలోనే ఛేదించిన మ్యాచ్
టాప్-4: 2017 ఫైనల్లో RPSపై ఒక్క రన్ తేడాతో గెలిచిన MI మ్యాచ్
టాప్-5: 2023 ఫైనల్లో GTపై CSK థ్రిల్లింగ్ విక్టరీ
News April 9, 2026
తక్కువే తిన్నా బరువు తగ్గట్లేదా?

తక్కువ తింటున్నా, వ్యాయామం చేస్తున్నా బరువు తగ్గట్లేదని కొందరు బాధపడుతుంటారు. అయితే వెయిట్ లాస్ వీటిపైనే ఆధారపడదని వైద్యులు చెబుతున్నారు. ‘ఎక్సర్ సైజ్ తర్వాత ఒకేచోట కదలకుండా ఉండటం కారణం కావొచ్చు. సరైన నిద్ర లేకపోవడం వల్ల అధిక క్యాలరీలు తీసుకోవడమూ మరో కారణం. అలాగే ప్రాసెస్ చేసిన ఫుడ్ కూడా బరువు తగ్గడానికి అడ్డుపడుతుంది. కొన్ని వ్యాధులకు వాడే మందులూ శరీర కొవ్వు తగ్గడాన్ని ఆపుతాయి’ అని అంటున్నారు.
News April 9, 2026
ఈనెల 15 నుంచి అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్

అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. పహల్గామ్, బాల్తాల్ మార్గాలకు ఈ రిజిస్ట్రేషన్ ఉంటుందని తెలిపింది. 13ఏళ్ల లోపు, 70ఏళ్లు పైబడిన వారికి అనుమతి లేదు. <


