News August 31, 2024

వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయిన కారు.. ముగ్గురు దుర్మరణం

image

AP: గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెదకాకాని మండలం ఉప్పలపాడు- గోళ్లమూడి మధ్య వరద ఉద్ధృతికి కాలువలో కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న టీచర్ రాఘవేంద్ర, పిల్లలు సాత్విక్, మాన్విక్ మరణించారు. కాగా విజయవాడలో కొండచరియలు విరిగిపడటంతో నలుగురు <<13984102>>దుర్మరణం<<>> పాలైన విషయం తెలిసిందే.

Similar News

News February 1, 2025

BUDGET: వీటి ధరలు తగ్గుతాయ్

image

ధరలు తగ్గేవి: మొబైల్ ఫోన్స్, ఈవీ బ్యాటరీస్, మెరైన్ ప్రొడక్ట్స్, LED, వెట్ బ్లూ లెదర్, ఓపెన్ సెల్, 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్&మెడిసిన్స్, ఫ్రోజెన్ ఫిష్ పేస్ట్ (సురిమి), కారియర్ గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్‌లు, 25 రకాల క్రిటికల్ మినరల్స్, జింక్, లిథియం-అయాన్ బ్యాటరీ స్క్రాప్.

ధరలు పెరిగేవి: ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లే, నిటెడ్ ఫ్యాబ్రిక్స్ (అల్లిన దుస్తులు)

News February 1, 2025

BUDGET 2025-26: కీలకాంశాలు

image

* ఆదాయ పన్ను మినహాయింపు రూ.12 లక్షలకు పెంపు
* అద్దెలపై వార్షిక TDS పరిధి రూ.6 లక్షలు
* స్టార్టప్స్‌ మొదలైననాటి నుంచి 5 ఏళ్ల పాటు ప్రయోజనాలు
* 36 రకాల కీలక ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీ రద్దు
* బీమా రంగంలో FDI పరిధి 100శాతానికి పెంపు
* పదేళ్లలో 100 స్థానిక ఎయిర్‌పోర్టుల నిర్మాణం
* వచ్చే ఐదేళ్లలో 75వేల మెడికల్ సీట్లు
* 2028 వరకు జల్ జీవన్ మిషన్ పొడిగింపు
* కిసాన్ క్రెడిట్ కార్డు రుణం రూ.5 లక్షలకు పెంపు

News February 1, 2025

అప్పుడు.. ఇప్పుడు!

image

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019 నుంచి వరుసగా 8వసారి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఆరు సార్లు రెగ్యులర్ బడ్జెట్‌, ఒక మద్యంతర బడ్జెట్‌ను సమర్పించగా నేడు ఎనిమిదో సారి ప్రసంగించారు. ప్రతిసారి సంప్రదాయ చీరకట్టులో ఎరుపు రంగు వస్త్రంలో ఉంచిన కాపీలు/ట్యాబ్‌తో ఆమె పార్లమెంట్‌కు రావడం విశేషం. ఇన్నేళ్లుగా ఒకే వ్యక్తి ఆర్థిక మంత్రిగా ఉండటంతో ఇండియన్ బడ్జెట్‌ను.. ‘నిర్మలమ్మ బడ్జెట్’ అని ప్రజలు పిలుస్తుంటారు.