News December 19, 2024
KTRపై అన్యాయంగా కేసు పెట్టారు: హరీశ్

TG: KTRపై కేసు నమోదు చేయడాన్ని హరీశ్ రావు ఖండించారు. ఆయనపై అన్యాయంగా కేసు నమోదు చేశారని అన్నారు. ఈ-కార్ రేసు ద్వారా రాష్ట్ర ఇమేజ్ పెంచేందుకు పని చేస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చెప్పేది నిజమైతే రేపు లేదా ఎల్లుండి అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 13, 2025
IRCTCలో 46 ఉద్యోగాలు

<
News November 13, 2025
మెన్స్ట్రువల్ కప్‌తో ఎన్నో లాభాలు

ఒక మెన్స్ట్రువల్ కప్ పదేళ్ల వరకూ పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇది 2,500 శ్యానిటరీ ప్యాడ్స్‌తో సమానం. అలాగే 12 గంటల వరకు లీకేజీ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ కప్ ఉపయోగిస్తున్నప్పుడు వ్యాయామం చేయడం, ఈత కొట్టడం, గెంతడం, రోప్ స్కిప్పింగ్ అన్నీ చేసుకోవచ్చంటున్నారు. అలాగే ప్యాడ్స్ వాడినప్పుడు కొన్నిసార్లు వెజైనల్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఈ మెన్స్ట్రువల్ కప్‌తో ఆ ఇబ్బంది ఉండదంటున్నారు నిపుణులు.
News November 13, 2025
కంపెనీల అనుమతుల్లో జాప్యం ఉండదు.. చంద్రబాబు స్పష్టం

AP: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని CM CBN స్పష్టం చేశారు. విశాఖలో నిర్వహించిన ఇండియా-యూరప్ బిజినెస్ మీట్లో ఆయన మాట్లాడారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజనెస్ విధానంలో ముందుకెళ్తున్నామని, కంపెనీల అనుమతుల్లో ఎలాంటి జాప్యం ఉండదని తేల్చి చెప్పారు. త్వరలో అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ అందుబాటులోకి రానున్నాయని వివరించారు.


