News December 3, 2024
హరీశ్ రావుపై కేసు నమోదు

TG: మాజీమంత్రి హరీశ్ రావుపై పంజాగుట్ట పీఎస్లో కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. 120(B) 386, 409, ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. హరీశ్ మంత్రిగా ఉండగా తన ఫోన్ ట్యాప్ చేయించి వేధించారని ఫిర్యాదులో ఆరోపించారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పేరునూ ఇందులో పేర్కొన్నారు.
Similar News
News January 16, 2026
తప్పిన యుద్ధ గండం: అరబ్ దేశాల దౌత్యంతో వెనక్కి తగ్గిన ట్రంప్!

ఇరాన్పై సైనిక చర్యకు సిద్ధమైన ట్రంప్ అనూహ్యంగా వెనక్కి తగ్గారు. నిరసనకారులపై కాల్పులు, ఉరిశిక్షలను ఇరాన్ నిలిపివేసిందన్న సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని వెనక సౌదీ, ఖతర్, ఒమన్ దేశాల ‘మధ్యరాత్రి దౌత్యం’ పనిచేసినట్లు తెలుస్తోంది. యుద్ధం వల్ల ప్రాంతీయ అస్థిరత ఏర్పడి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ దేశాలు హెచ్చరించడంతో ట్రంప్ శాంతించినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతానికి యుద్ధ భయాలు తొలగినట్లే!
News January 16, 2026
సాయంత్రం 6గంటలకు బిగ్ రివీల్: లోకేశ్

AP: గ్రీన్ ఎనర్జీలో రాష్ట్రం గ్లోబల్ హబ్గా మారనుందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. కాకినాడ నుంచి జర్మనీ, సింగపూర్, జపాన్ వరకూ సప్లై చేస్తామని ఆయన వెల్లడించారు. 10 బిలియన్ డాలర్ల పెట్టుబడుల వల్ల 8 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయని పేర్కొన్నారు. ఈ సాయంత్రం 6గంటలకు బిగ్ రివీల్ కోసం వేచి ఉండండి అని తెలిపారు. గ్రీన్ ఎనర్జీకి సంబంధించి భారీ పెట్టుబడుల ప్రకటన ఉండనున్నట్లు తెలుస్తోంది.
News January 16, 2026
పూరీ-సేతుపతి ‘స్లమ్ డాగ్’.. ఫస్ట్ లుక్ విడుదల

పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న సినిమాకు ‘స్లమ్ డాగ్’ అనే టైటిల్ ఖరారైంది. హీరో బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఇందులో విజయ్ నోట్ల కట్టల మధ్య కత్తి పట్టుకొని కనిపిస్తున్నారు. సంయుక్తా మేనన్, టబు, దునియా విజయ్ నటిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నారు.


