News September 24, 2024
కేతిరెడ్డిపై కేసు నమోదు

AP: ధర్మవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై కేసు నమోదైంది. నిన్న సబ్ జైలు వద్ద టీడీపీ కార్యకర్తపైకి <<14175931>>కారు<<>> ఎక్కించే ప్రయత్నం చేశారని బీజేపీ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేతిరెడ్డితో పాటు అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
Similar News
News January 15, 2026
నేటి నుంచి U-19 వన్డే వరల్డ్ కప్

జింబాబ్వేలో నేటి నుంచి ICC U-19 వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. జులవాయో వేదికగా ఇవాళ భారత జట్టు USAను ఢీకొట్టనుంది. ఇప్పటి వరకు 16 సార్లు టోర్నీ జరగ్గా IND 5 టైటిళ్లు గెలిచింది. ఆరోసారి కప్ సొంతం చేసుకోవాలని ఆయుష్ మాత్రే సారథ్యంలో బరిలోకి దిగుతోంది. ఇక 14ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే అందరి దృష్టి నిలిచింది. అటు ఇవాళ ఇతర మ్యాచుల్లో జింబాబ్వే-స్కాట్లాండ్, టాంజానియా-వెస్టిండీస్ పోటీ పడనున్నాయి.
News January 15, 2026
సేంద్రియ సాగుతోనే సక్సెస్

కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలోని గౌరిబిదనూర్లో బంజరు భూమిని పదేళ్లకు లీజుకు ఉమేష్ వ్యవసాయం ప్రారంభించారు. రెండు ఎకరాల్లో ఒకవైపు సాగును కంటిన్యూ చేస్తూ భూమిని సారవంతం చేసుకున్నారు. కోడి ఎరువు, మేక ఎరువు, ఆవు పేడ ఎరువును కలిపి నేలను సారవంతంగా మార్చారు. మార్కెట్ స్టడీ చేసి ఓడీసీ-3 వెరైటీ మునగ మొక్కలను నాటారు. ఇవి అనుకున్నట్టుగానే 3-4 నెలల్లోనే కాపుకు వచ్చి, ఆరు నెలల్లో మంచి దిగుబడి వచ్చింది.
News January 15, 2026
ఏడాదికి రూ.40 లక్షలకు పైగా ఆదాయం

ప్రస్తుతం ఉమేష్ ఎకరానికి 10 టన్నుల తాజా మునగ ఆకులను సేకరిస్తున్నారు. ఆకులను షేడ్ నెట్ల కింద సహజంగా ఎండబెట్టి, దాదాపు 2.5 నుంచి 3 టన్నుల వరకు పొడిని సేకరిస్తారు. kg సగటున రూ.140 చొప్పున ఫార్మా కంపెనీలు, న్యూట్రాస్యూటికల్ కంపెనీలు, ఎరువుల కంపెనీలకు విక్రయిస్తున్నారు. డిమాండ్ బట్టి కొన్నిసార్లు రూ.500కు అమ్ముతారు. ఏడాదికి మునక్కాయలు, పొడి నుంచి 10 ఎకరాలకు రూ.40 లక్షల ఆదాయం పొందే స్థాయికి ఎదిగారు.


