News May 13, 2024

మాధవీలతపై కేసు నమోదు

image

HYD MP స్థానం BJP అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదైంది. ఓ పోలింగ్ బూత్‌లో ముస్లిం మహిళల ముఖంపై బురఖాలను ఆమె తొలగించిన తీరుపై అభ్యంతరం వ్యక్తమైంది. దీనిపై హైదరాబాద్ ఎన్నికల అధికారి రొనాల్డ్ కేసు నమోదుకు పోలీసులను ఆదేశించారు. అటు కొడంగల్ సభలో మోదీ, BJPలపై రేవంత్ విమర్శలను BJP నేత రఘునందన్ తప్పుబట్టారు. కోడ్ ఉల్లంఘించి రేవంత్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడారని ECకి ఫిర్యాదు చేశారు.

Similar News

News March 10, 2026

VIRAL PHOTO: ‘ఫిట్’ మ్యాన్

image

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫిట్‌నెస్‌తో ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా వెకేషన్‌లో ఉన్న ఆయన షర్ట్ లెస్ ఫొటోను షేర్ చేయగా వైరలవుతోంది. సిక్స్ ప్యాక్ కోసం హిట్ మ్యాన్ ప్రయత్నిస్తున్నారని, బాడీ చూస్తేనే అర్థమవుతోందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తక్కువ సమయంలోనే అదిరిపోయే ఫిట్‌నెస్‌ సాధించారని ప్రశంసిస్తున్నారు. కాగా ఈనెల చివర్లో IPL-2026 ప్రారంభంకానుంది.

News March 10, 2026

US-ఇరాన్‌ పోరు.. LICకి ₹70వేల కోట్లు నష్టం

image

అమెరికా,ఇజ్రాయెల్-ఇరాన్ పోరుతో LIC భారీగా నష్టపోయింది. FEB 27 నాటికి ₹14.88 లక్షలకోట్లుగా ఉన్న ఆ సంస్థ పెట్టుబడులు.. మార్చి 9 నాటికి 4.7% (₹70,105కోట్లు) తగ్గి ₹14.17లక్షల కోట్లకు చేరాయి. ఏస్ ఈక్విటీ సంస్థ డేటా ఈ విషయాన్ని వెల్లడించింది. కేవలం SBI, HDFC, ICICI బ్యాంక్ స్టాక్స్ క్రాష్ అవడం వల్ల LICకి ఏకంగా ₹15,293కోట్లు (21.8%) లాస్ వచ్చింది. ఇక L&Tలో ఇన్వెస్ట్‌మెంట్ వల్ల ₹7,609కోట్లు నష్టపోయింది.

News March 10, 2026

జాబ్ హగ్గింగ్.. ఏంటిది?

image

కరోనా తర్వాత ‘క్వైట్ క్విట్టింగ్’, ‘కెరీర్ కుషనింగ్’ వంటి ట్రెండ్స్ చూశాం. ఇప్పుడు ‘జాబ్ హగ్గింగ్’ వంతు. అంటే.. ప్రస్తుత ఉద్యోగంలో సంతృప్తి లేకపోయినా, గ్రోత్ లేకపోయినా.. ఆర్థిక అనిశ్చితి, లేఆఫ్స్ భయంతో ఉన్నా.. దాన్నే గట్టిగా పట్టుకొని ఉండటం. ఇది కంపెనీపై ప్రేమతో చేసేది కాదు. బయట పరిస్థితులు బాగోలేక భద్రత కోసం తీసుకుంటున్న కేర్. కొత్త రిస్క్ తీసుకోవడం కంటే వస్తున్న జీతాన్ని కాపాడుకోవడం అన్నమాట.