News November 16, 2024
మహాసేన రాజేశ్‌పై కేసు నమోదు
AP: టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేశ్, అతని అనుచరులపై కేసు నమోదైంది. తన ఫొటోలు మార్ఫింగ్ చేసి పోస్టులు పెట్టారని ఓ మహిళ ఫిర్యాదు చేయగా, కోనసీమ జిల్లా మలికిపురం స్టేషన్లో కేసు నమోదైంది. మార్ఫింగ్‌పై ఫేస్బుక్ నుంచి వివరాలు కోరామని, స్పష్టత రాగానే చర్యలుంటాయని పోలీసులు చెప్పారు. రాజేశ్ మాట్లాడుతూ.. తన పేరుతో ఎవరో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారనన్నారు. ఆ పోస్టులతో తనకు సంబంధం లేదని చెప్పారు.
Similar News
News November 16, 2024
తిరుమలలో రేపు కార్తీక వనభోజనం.. పటిష్ఠ ఏర్పాట్లు
AP: తిరుమలలో రేపు కార్తీక వన భోజన కార్యక్రమం సందర్భంగా పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. వర్ష సూచనల నేపథ్యంలో వన భోజనం నిర్వహణ వేదికను పార్వేట మండపం నుంచి వైభవోత్సవం మండపానికి మార్చినట్లు తెలిపింది. రేపు ఉ.11 గంటలకు గజ వాహనంపై ఊరేగింపుగా వైభవోత్సవ మండపానికి మలయప్పస్వామి రానున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు.
News November 16, 2024
ఆధార్ ఉన్నవారికి అలర్ట్
మీ ఆధార్ దుర్వినియోగమైందా? లేదా? తెలుసుకోవాలంటే..
* <
* తర్వాత అథెంటికేషన్ హిస్టరీపై క్లిక్ చేయండి.
* అక్కడ ‘ఆల్’ని సెలెక్ట్ చేసి ‘ఫెచ్ అథెంటికేషన్ హిస్టరీ’పై క్లిక్ చేస్తే మీ ఆధార్ ఎక్కడెక్కడ ఉపయోగించారనే వివరాలు తెలిసిపోతాయి. మీ ఆధార్ దుర్వినియోగమైనట్లు తెలిస్తే 1947కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.
News November 16, 2024
‘అమరన్’ థియేటర్‌పై పెట్రోల్ బాంబు దాడి
తమిళనాడులోని తిరునల్వేలిలో ‘అమరన్’ మూవీ ఆడుతున్న థియేటర్‌పై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. ఇవాళ తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు 3 పెట్రోల్ బాంబుల్ని హాల్‌పైకి విసరడం సీసీ కెమెరాల్లో నమోదైంది. స్థానికుల మధ్య ఉన్న తగాదాలే దీనికి కారణమని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. సినిమాలో కొన్ని సన్నివేశాలపై తమిళనాట కొన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు.