News April 3, 2024

రఘునందన్‌రావుపై కేసు నమోదు

image

TG: మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై కేసు నమోదైంది. మార్చి 27న బీజేపీ కార్యకర్తల సమావేశంలో హరీశ్‌రావు, మెదక్ BRS MP అభ్యర్థి వెంకట్రామిరెడ్డి‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని ఆయన కోరినట్లు పోలీసులు వెల్లడించారు.

Similar News

News January 4, 2025

AP-TG మధ్య కొత్త వివాదం

image

తెలుగు రాష్ట్రాల మధ్య మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు AP CM చంద్రబాబు ప్రకటించిన <<15020850>>బనకచర్ల ప్రాజెక్టుపై<<>> తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు అనుమతులు లేవని CM రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తెలంగాణ అభ్యంతరాలను AP CSకు పంపాలని ఆయన సూచించారు. అవసరమైతే గోదావరి బోర్డు, కేంద్ర జలశక్తి శాఖకు లేఖలు రాయాలని ఆదేశించారు.

News January 4, 2025

సౌతాఫ్రికా క్రికెటర్ సరికొత్త ఘనత

image

సౌతాఫ్రికా ప్లేయర్ ర్యాన్ రికెల్‌టన్ సరికొత్త ఘనత సాధించారు. టెస్టుల్లో తొలి సారి ఓపెనింగ్ చేస్తూ అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచారు. పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రికెల్‌టన్ (214*) డబుల్ సెంచరీ సాధించారు. ఈ క్రమంలో బ్రెండన్ మెక్‌కల్లమ్ (201*) రికార్డును ఆయన అధిగమించారు. వీరి తర్వాత గ్రేమీ స్మిత్ (200), కాన్వే (200), శిఖర్ ధవన్ (187), రోహిత్ శర్మ (176), జైస్వాల్ (171) ఉన్నారు.

News January 4, 2025

‘హరిహరవీరమల్లు’ నుంచి బిగ్ అప్డేట్

image

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహరవీరమల్లు’ మూవీ నుంచి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ నెల 6న ఉదయం 9.06 గంటలకు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘మాట వినాలి’ అనే సాంగ్‌ను స్వయంగా పవన్ ఆలపించడం విశేషం. జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.