News May 21, 2024

ఉప ముఖ్యమంత్రిపై కేసు నమోదు

image

AP: కడప గౌస్‌నగర్‌లో జరిగిన అల్లర్ల ఘటనలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు 21 మంది వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. ఇటు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డితో పాటు 24 మంది టీడీపీ కార్యకర్తల పైనా కేసులు నమోదయ్యాయి.

Similar News

News December 24, 2024

మనూ చాలా బాధపడింది: తండ్రి రామ్ కిషన్

image

భారత షూటర్ మనూ భాకర్‌ను ఖేల్‌ర‌త్నకు నామినేట్ <<14958848>>చేయకపోవడంపై<<>> ఆమె తండ్రి రామ్ కిషన్ స్పందించారు. ‘ఆమెను షూటింగ్‌ క్రీడాకారిణికి బదులుగా క్రికెటర్‌ని చేసి ఉండాల్సింది. ఒలింపిక్స్‌లో ఎవరూ సాధించని రికార్డును నెలకొల్పింది. నా బిడ్డ దేశం కోసం ఇంకా ఏమి చేయాలని మీరు ఆశిస్తున్నారు? దీనిపై మనూ కూడా బాధపడింది. తాను ఒలింపిక్స్‌కు వెళ్లి దేశం కోసం పతకాలు సాధించకపోవాల్సిందని ఆవేదన వ్యక్తం చేసింది’ అని తెలిపారు.

News December 24, 2024

విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు: బుద్ధప్రసాద్

image

AP: ఈ నెల 28, 29 తేదీల్లో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరుగుతాయని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. విజయవాడలోని KBN కాలేజీలో ఈ సభలు జరుగుతాయని చెప్పారు. పర్యావరణంపై 170 మందితో ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తెలుగు భాషాభిమానులు, సాహితీవేత్తలు ఇందులో పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రసంగాలు, కవి సమ్మేళనాలు, సదస్సులు ఉంటాయని చెప్పారు.

News December 24, 2024

రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

image

AP ఫైబర్‌నెట్‌లో గత ప్రభుత్వం నియమించిన 410 మంది ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. మరో 200 మంది ఉద్యోగుల నియామకపత్రాలు పరిశీలిస్తున్నామని, లీగల్ నోటీసులు ఇచ్చి వివరణ కోరుతామని ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీరెడ్డి వెల్లడించారు. వైసీపీ అర్హత లేని వారిని నియమించిందని, కొందరు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లల్లో పనిచేశారని వెల్లడించారు. వేతనాల పేరుతో రూ.కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.