News September 14, 2024
నటి జెత్వానీ ఫిర్యాదుతో వైసీపీ నేతపై కేసు నమోదు

AP: ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కుక్కల విద్యాసాగర్తో పాటు మరికొందరిపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై YCP నాయకుడు విద్యాసాగర్తో తప్పుడు ఫిర్యాదు చేయించారని ఆమె నిన్న రాత్రి ఫిర్యాదు చేశారు. తనను నిర్బంధించి, చిత్ర హింసలకు గురి చేశారని పేర్కొన్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు పోలీసులు సస్పెండ్ అవ్వగా, కీలకంగా వ్యవహరించిన IPSలపైనా చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Similar News
News November 11, 2025
కొవిడ్ లాక్డౌన్.. వారికి కొత్త ద్వారాలు తెరిచింది

కరోనా లాక్డౌన్ వీరి జీవితాన్ని మార్చేసింది. లండన్లో BBA చదువుతున్న ఆయుష్, దుబాయ్లో బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్న రిషబ్ ఇండియాకు తిరిగివచ్చారు. స్వదేశంలోనే ఉండాలని, వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఫ్యామిలీ ప్రోత్సాహంతో కూరగాయల సాగును ప్రారంభించి.. పుట్టగొడుగులకు ఉన్న డిమాండ్ చూసి వాటిని కూడా ఉత్పత్తి చేస్తూ ఆగ్రా సహా ఇతర రాష్ట్రాల మార్కెట్లు, హోటల్స్కు అందిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.
News November 11, 2025
UGC-NET దరఖాస్తులో తప్పుల సవరణకు అవకాశం

అసిస్టెంట్ ప్రొఫెసర్, JRFకోసం నిర్వహించే UGC-NET డిసెంబర్ 2025 దరఖాస్తులో తప్పుల సవరణకు NTA అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నవంబర్ 12న సవరణ చేసుకోవచ్చని ప్రకటించింది. అభ్యర్థుల పేరు, జెండర్, ఫొటో, సంతకం, మొబైల్ నంబర్, ఈ- మెయిల్, అడ్రస్, పరీక్ష సిటీ మార్చుకోవచ్చు. పరీక్షలు డిసెంబర్ 31 నుంచి జనవరి 7 వరకు రోజుకు రెండు సెషన్లలో జరగనున్నాయి.
News November 11, 2025
పద్మాసనంలో దర్శనమిచ్చే ఆంజనేయుడు

కర్ణాటక హంపిలో ఉన్న యంత్రోద్ధారక హనుమాన్ ఆలయం చాలా ప్రత్యేకం. ఇక్కడ ఆంజనేయుడు నిలబడే రూపంలో కాకుండా, పద్మాసనంలో కూర్చుని దర్శనమిస్తాడు. విజయనగర సామ్రాజ్య రాజగురువు అయిన వ్యాసరాజ తీర్థులు ఈ ఆలయాన్ని స్థాపించారు. ఈ స్వామి చుట్టూ ఓ పవిత్రమైన యంత్రం కూడా ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైన రేఖాచిత్రం అని నమ్ముతారు. ఈ రూపం హనుమంతుని ధ్యాన శక్తి, జ్ఞానం, స్థిరమైన భక్తికి ప్రతీకగా పూజలందుకుంటోంది. <<-se>>#Temple<<>>


