News July 20, 2024
బాలికపై హత్యాచారం కేసు.. ఓ వ్యక్తి లాకప్ డెత్?
AP: నంద్యాల(D) ముచ్చుమర్రిలో బాలిక హత్యాచారం కేసులో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. బాలిక మృతదేహాన్ని మాయం చేసేందుకు ముగ్గురు మైనర్లకు సహకరించిన నలుగురు కుటుంబసభ్యులను పోలీసులు మూడు రోజుల క్రితం కస్టడీలోకి తీసుకున్నారు. అందులో ఒకరైన హుస్సేన్ (నందికొట్కూర్) ఈ తెల్లవారుజామున PSలో మరణించాడు. పోలీసులు విచారణ పేరుతో తీవ్రంగా హింసించడం వల్లే చనిపోయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Similar News
News January 23, 2025
అటవీశాఖలో మార్పులపై పవన్ ఫోకస్
AP: అటవీశాఖలో సమూల మార్పులపై Dy.CM పవన్ దృష్టి సారించారు. అటవీ భూముల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్టకు యాక్షన్ ప్లాన్, అటవీ ఉత్పత్తుల నుంచి ఆదాయం పెంపునకు మార్గాలు అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు సిబ్బంది కొరతను తీర్చే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎకో టూరిజం అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు.
News January 23, 2025
రేపు ఉ.10 గంటలకు..
AP: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. ఏప్రిల్ నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ ఎంట్రీ టికెట్లు ఈ నెల 24న ఉ.10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. అలాగే తిరుమల, తిరుపతిలో ఆ నెలకు సంబంధించిన గదుల కోటాను రేపు మ.3 గంటలకు రిలీజ్ చేస్తారు. ఇక శ్రీవారి సేవ కోటా టికెట్లను ఈ నెల 27న ఉ.11 గం.కు విడుదల చేయనున్నారు. దళారులను నమ్మవద్దని <
News January 23, 2025
మూడో తరగతి విద్యార్థి ఫీజు రూ.2.1 లక్షలు
చదువును కొందరు బిజినెస్గా మార్చేశారని విమర్శలొస్తున్నాయి. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని చెమటోడుస్తున్న తల్లిదండ్రులకు ఫీజుల రూపంలో కొన్ని స్కూళ్లు చుక్కలు చూపిస్తున్నాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ స్కూల్లో మూడో తరగతి ఫీజు షాక్కి గురిచేస్తోంది. పిల్లాడి చదువుకోసం ఏడాదికి రూ.2.1 లక్షలు చెల్లించాలా? అంటూ సీఎం సిద్ద రామయ్యను ఓ వ్యక్తి ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.