News April 29, 2024
ఇల్లు తగలబెట్టిన పిల్లి

చైనాలో ఓ పెంపుడు పిల్లి ఇంటిని తగలబెట్టింది. నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో దండన్ అనే వ్యక్తి ఓ పిల్లిని పెంచుకుంటున్నారు. దాని పేరు జిన్‌గూడియావో. అయితే ఆ పిల్లి వంటగదిలో ఆడుకుంటూ పొరపాటున ఇండక్షన్ కుక్కర్ టచ్ ప్యానెల్‌పై అడుగుపెట్టగా స్టవ్ అంటుకొని వంటగది మొత్తం కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. ఆ తర్వాత క్యాబినెట్‌లో బూడిదలో కూరుకుపోయిన పిల్లిని గుర్తించారు.
Similar News
News February 2, 2026
వేరుశనగలో అంతర పంటలతో లాభాలేంటి?

వర్షాభావ పరిస్థితులు, బెట్ట, కరవు పరిస్థితులు ఏర్పడి ప్రధాన పంట అయిన వేరుశనగ నష్టపోయినా.. అంతర పంటల నుంచి కొంత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. వేరుశనగ, అంతరపంటల వేరువ్యవస్థ పొడవులో తేడాల వల్ల భూమిలోని పోషకాలు, నీటిని పంటలు సమర్థవంతంగా వినియోగించుకునే వీలుంటుంది. చీడపీడల ఉనికి చాలావరకు తగ్గుతుంది. వర్షపునీటిని పొలంలోనే ఇంకేటట్లు చేయడంలో, నేలకోతను నివారించడంలో అంతరపంటలు కీలకపాత్ర పోషిస్తాయి.
News February 2, 2026
ఏ గ్రహానికి ఏ నైవేద్యం సమర్పిస్తే శుభం?

ఆదిత్యుడు – గోధుమలు, రవ్వ చక్కెర పొంగి
చంద్రుడు – పెరుగన్నం
అంగారకుడు – కందిపప్పు అన్నం
బుధుడు – పెసరపప్పు అన్నం
గురు – సెనగపప్పు అన్నం
శుక్రుడు – చిక్కుడు గింజల అన్నం
శని – నల్లని నువ్వులు కలిపిన అన్నం
రాహువు – మినుములతో కూడిన అన్నం
కేతువు – ఉలవల అన్నం
News February 2, 2026
WPL: ఢిల్లీ కల సాకారమయ్యేనా!

మహిళా ప్రీమియర్ లీగ్(WPL)లో ఢిల్లీ క్యాపిటల్స్(DC) జట్టు స్థిరమైన ప్రదర్శనతో కొనసాగుతోంది. వరుసగా నాలుగు సీజన్లలో ప్లేఆఫ్ చేరిన జట్టుగా DC నిలిచింది. గత మూడు సీజన్లలో ఫైనల్ వరకు వెళ్లింది. రేపు గుజరాత్ జెయింట్స్‌తో జరిగే ఎలిమినేటర్‌లో విజయం సాధిస్తే వరుసగా నాలుగు సార్లు ఫైనల్ చేరిన జట్టుగానూ నిలవనుంది. ఫైనల్లో ఆర్సీబీపై గెలిస్తే తొలి సారి విజేతగా నిలవాలనే కల సాకారం కానుంది.


