News November 21, 2024
విరాట్ ఒక సెంచరీ చేస్తే చాలు: పుజారా

విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాపై పరుగుల వరద పారిస్తారని చటేశ్వర్ పూజారా ఓ ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేశారు. ‘ఒక్క సెంచరీ చేస్తే చాలు విరాట్‌కు కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. ఇక ఆ తర్వాత అతడిని ఎవరూ ఆపలేరు’ అని పేర్కొన్నారు. పుజారా BGT కోసం స్టార్ స్పోర్ట్స్‌లో హిందీ కామెంటేటర్‌గా వ్యవహరించనున్నారు. కాగా.. విరాట్‌కు ఆస్ట్రేలియాలో అద్భుతమైన రికార్డుంది. అక్కడ జరిగిన 13 మ్యాచుల్లో 1352 రన్స్ చేశారు.
Similar News
News November 18, 2025
దేశాధినేతలు.. మరణశిక్షలు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అక్కడి తాత్కాలిక ప్రభుత్వం నిన్న <<18311462>>మరణశిక్ష<<>> విధించింది. ఇలా దేశాధినేతలు ఉరిశిక్ష ఎదుర్కోవడం గతంలోనూ జరిగింది. పాక్‌లో జుల్ఫికర్ అలీ బుట్టో, తుర్కియేలో అద్నాన్ మెండెరెస్, ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్‌లకు మరణశిక్ష అమలైంది. సౌత్ కొరియాలో చున్ డూ హ్వాన్‌కు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. పాక్‌లో ముషారఫ్ మరణశిక్షను తర్వాత రద్దు చేశారు.

ఎసెన్స్లతో ఎన్నో లాభాలు

ఎసెన్స్‌లు సీరమ్స్లానే ఉంటాయి కానీ టెక్చర్ తేలికగా ఉంటుంది. ఎసెన్సుల్లో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ స్కిన్ మాయిశ్చర్ లెవెల్ పెంచి ఇతర స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్ ఎఫెక్ట్స్ మెరుగుపరచడంలో సాయపడతాయి. టోనర్ తర్వాత, సీరమ్‌కు ముందు అరచేతులు లేదా స్ప్రే బాటిల్‌ని ఉపయోగించి ఎసెన్స్ అప్లై చేయాలి. టోనర్లు, ఎసెన్స్‌లు రెండూ స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్ ఎఫెక్ట్స్ మెరుగుపరచడానికి సినర్జిస్టిక్‌గా పనిచేస్తాయి.