News December 14, 2024
హైబ్రిడ్ మోడల్లోనే ఛాంపియన్స్ ట్రోఫీ?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 హైబ్రిడ్ మోడల్లోనే జరుగుతుందని తెలుస్తోంది. దీనిపై ఇవాళ పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ స్వయంగా ప్రకటన చేస్తారని సమాచారం. అలాగే భారత్ ఆడే మ్యాచులన్నీ దుబాయ్ వేదికగా జరుగుతాయని తెలుస్తోంది. ఇకపై చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచులన్నీ తటస్థ వేదికల్లో జరుగుతాయి. వచ్చే ఏడాది ఇండియాలో జరిగే వుమెన్స్ వరల్డ్ కప్‌లో కూడా దాయాదులు హైబ్రిడ్ పద్ధతిలోనే ఆడే అవకాశం ఉంది.
Similar News
News October 15, 2025
గూగుల్ డేటా సెంటర్‌కు పోల’వరం’!

విశాఖలో ఏర్పాటు చేయబోయే గూగుల్ డేటా సెంటర్‌కు భారీ స్థాయిలో నీరు అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఏడాదికి 1 టీఎంసీ జలాలు అవసరం అవుతాయని అంటున్నారు. అయితే పోలవరం లెఫ్ట్ మెయిన్ కాలువ ద్వారా విశాఖకు ఏడాదికి 23.44 TMCల నీరు సరఫరా కానుంది. ఆ ప్రాజెక్టు 2028 నాటికి పూర్తి కానుంది. దీనివల్ల నీటి సమస్య తీరే ఛాన్స్ ఉంది. ఇక గ్రీన్ హైడ్రోజన్, సోలార్, విండ్ పవర్.. డేటా సెంటర్ విద్యుత్ అవసరాలను తీర్చనున్నాయి.
News October 15, 2025
ఢిల్లీకి సంజూ? KKRకు కేఎల్ రాహుల్?

సంజూ శాంసన్‌ను దక్కించుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆసక్తిగా ఉన్నట్లు జాతీయ మీడియా తెలిపింది. అక్షర్ స్థానంలో శాంసన్‌కు ఆ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. సంజూకు బదులు ఏ ప్లేయర్‌ను RRకు ట్రేడ్ చేయాలనే దానిపై సమాలోచనలు జరుపుతున్నట్లు టాక్. ఇక ఢిల్లీ స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ కోసం KKR ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. ఆయనకు కెప్టెన్సీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
News October 15, 2025
సిరి సంపదలకు పునాది ‘వాస్తు’

వాస్తు బాగున్న ఇంట్లో నివసిస్తే వారికి సిరిసంపదలకు లోటుండదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘మంచి వాస్తు వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రభావవంతమైన ఆలోచనలు వస్తాయి. అవి అవకాశాలను సృష్టిస్తాయి. తద్వారా ఆదాయం పెరుగుతుంది. దీంతో మన జీవితంలో సౌకర్యాలు, సదుపాయాలు ఏర్పడతాయి. ఇవే అంతిమంగా మనకు ఆనందాన్ని, సంతృప్తిని అందిస్తాయి. వాస్తే మన సౌభాగ్యానికి తొలి మెట్టు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>