News August 30, 2024

చంద్రబాబు కర్నూలు పర్యటనలో మార్పు

image

AP: సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనలో మార్పు చోటు చేసుకుంది. రేపు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి పుచ్చకాయలమడలో పర్యటించాల్సి ఉండగా ఓర్వకల్లులో పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News November 13, 2025

భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్

image

నిన్న కాస్త తగ్గి రిలీఫ్ ఇచ్చిన గోల్డ్ రేట్స్ ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. బంగారం రూ.2,290 పెరిగి రూ.1,27,800కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.2,100 ఎగబాకి రూ.1,17,150గా నమోదైంది. అటు వెండి ధర ఇవాళ కూడా భారీగా పెరిగింది. కేజీ సిల్వర్ రేట్ రూ.9వేలు పెరిగి రూ.1,82,000కు చేరింది.

News November 13, 2025

నాలుగు ప్రధాన నగరాల్లో పేలుళ్లకు కుట్ర: నిఘా వర్గాలు

image

‘ఢిల్లీ పేలుడు’పై దర్యాప్తు చేపట్టిన అధికారులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. 8 మంది ఇద్దరిద్దరుగా విడిపోయి 4 ప్రధాన నగరాల్లో పేలుళ్లకు కుట్ర పన్నారని సమాచారం. ప్రతి గ్రూప్ భారీగా IED తీసుకెళ్లాలని నిర్ణయించారని, పేలుళ్ల కోసం 20 క్వింటాళ్లకు పైగా ఎరువులను సేకరించినట్లు తెలిసింది. మరోవైపు ఢిల్లీ బ్లాస్ట్‌కు ముందు ఉమర్‌కు రూ.20 లక్షల డబ్బు అందిందని నిఘా వర్గాలు గుర్తించాయి.

News November 13, 2025

NIT వరంగల్‌ 45పోస్టులకు నోటిఫికేషన్

image

<>NIT <<>>వరంగల్ 45 ఫ్యాకల్టీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. PhD, ME, M.Tech, MSc, MBA, MCA, MA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవంగల వారు డిసెంబర్ 12వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులను షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.2000, SC,ST,PwDలకు రూ.1000. వెబ్‌సైట్: https://nitw.ac.in/faculty