News November 18, 2024
బయటకొస్తున్న DRM ఆస్తుల చిట్టా

AP: లంచం తీసుకుంటూ <<14636570>>సీబీఐకి<<>> పట్టుబడిన విశాఖ వాల్తేరు DRM సౌరభ్ ప్రసాద్ ఆస్తుల చిట్టా బయటకొస్తోంది. ఇప్పటివరకు సౌరభ్కు చెందిన రూ.87.6 లక్షల ఆస్తులను సీబీఐ జప్తు చేసింది. రూ.72లక్షల విలువైన బంగారం, ఆస్తుల పత్రాలను సీజ్ చేసింది. ముంబైలోని అపార్ట్మెంట్లో లాకర్ను సీబీఐ అధికారులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Similar News
News December 17, 2025
రూ.కోట్లు ఉంటేనే రాజకీయం!

రూ.కోట్లు ఉంటే తప్ప ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయలేమని చాలా మంది ఎప్పుడో ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలూ అలాగే మారిపోయాయి. కొన్ని గ్రామాల్లో ఓటుకు రూ.25వేలు, <<18557291>>రూ.40వేల<<>> వరకు పంచారంటే ‘ఓటుకు నోటు’ సంస్కృతి ఎంతగా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. దీంతో చదువుకున్న యువతీయువకులు పోటీ చేయాలంటేనే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ‘డబ్బున్న వాళ్లదే రాజ్యమా?’.. దీన్ని మార్చలేమా? మీ COMMENT?
News December 17, 2025
పేరెంట్స్ కాబోతున్న నాగచైతన్య-శోభిత?

టాలీవుడ్ కపుల్ నాగచైతన్య-శోభిత దంపతులు బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం పేర్కొంది. తాజాగా ఓ ఈవెంట్లో తాతగా ప్రమోట్ కాబోతున్నారా అని అడిగిన ప్రశ్నకు చైతూ తండ్రి నాగార్జున సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. ఒత్తిడి చేయడంతో సరైన సమయంలో తానే చెబుతానని చెప్పారు. కాగా ఈ మేలో శోభిత డ్రెస్సింగ్ చూసి తల్లి కాబోతోందని వార్తలు వచ్చాయి. వీరిద్దరూ 2024 DECలో పెళ్లి చేసుకున్నారు.
News December 17, 2025
వచ్చే ఏడాదిలో అందుబాటులోకి మూడో డిస్కం

TG: రాష్ట్రంలో వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి మూడో డిస్కం అందుబాటులోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీని కిందికి 29,05,779 వ్యవసాయం, 489 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, 1132 మిషన్ భగీరథ, 639 మున్సిపల్ వాటర్ కనెక్షన్లు వెళ్లనున్నాయి. జెన్కోకు చెల్లించాల్సిన రూ.26,950 కోట్లు, రూ.9,032 కోట్ల ప్రతిపాదిత రుణాలు, రూ.35,982 కోట్ల బకాయిలు ఈ డిస్కంకు మళ్లించబడతాయి. దీనికి 2వేల మంది ఉద్యోగులను కేటాయించనుంది.


