News September 24, 2024
దీప్తికి రూ.కోటి చెక్కు, మొగిలయ్యకు ఇంటి స్థలం

TG: పారాలింపిక్స్-2024లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజికి సీఎం రేవంత్ రెడ్డి రూ.కోటి చెక్కును అందజేశారు. ఈ నెల 7న రేవంత్ రెడ్డి దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి, వరంగల్లో 500 గజాల ఇంటిస్థలం, కోచ్కు రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఇక ప్రముఖ కిన్నెర వాయిద్యకారుడు, పద్మశ్రీ గ్రహీత దర్శనం మొగిలయ్యకు HYD హయత్ నగర్లో 600 చదరపు గజాల ఇంటిస్థలం ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
Similar News
News December 15, 2025
దురదృష్టం.. ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ చేసినా

TG: సూర్యాపేటలోని గుడిబండ గ్రామంలో ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన వెంకటేశ్వర్లుకు దురదృష్టం వెంటాడింది. కేవలం పది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మంత్రి ఉత్తమ్, ఆయన సతీమణి పద్మావతి వ్యక్తిగతంగా మద్దతు తెలిపినా వెంకటేశ్వర్లుకు పరాజయం తప్పలేదు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నాగయ్య చేతిలో ఓడారు. వెంకటేశ్వర్లు పదవీకాలం మరో 5 నెలల్లో ముగియనుండగా VRS తీసుకొని పోటీ చేశారు.
News December 15, 2025
చిరంజీవికి ఆ లుక్ వద్దని చెప్పా: అనిల్ రావిపూడి

‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా కోసం చిరంజీవి ‘సాల్ట్ అండ్ పెప్పర్’ లుక్ ప్రయత్నిస్తానన్నారని, తానే వద్దని చెప్పినట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. బయట ఎలా ఉన్నారో సినిమాలో అలానే చూపిస్తానని చెప్పానని అనిల్ అన్నారు. కాగా ఈ మూవీలో వెంకీ-చిరు కాంబినేషన్లో 20 నిమిషాల సీన్స్ ఉంటాయని చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుండగా, ఇప్పటికే వెంకీ రోల్ షూటింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే.
News December 15, 2025
డిసెంబర్ 15: చరిత్రలో ఈరోజు

✪ 1933: సినీ దర్శకుడు బాపు జననం
✪ 1950: భారత తొలి ఉపప్రధాని సర్దార్ వల్లభాయి పటేల్ మరణం (ఫొటోలో)
✪ 1952: ప్రత్యేకాంధ్ర పోరాటయోధుడు పొట్టి శ్రీరాములు మరణం
✪ 1973: మూవీ డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా జననం
✪ 1990: హీరోయిన్ లావణ్య త్రిపాఠి జననం
✪ 2014: సంగీత దర్శకుడు చక్రి మరణం


