News April 13, 2024

థియేటర్లలోకి తిరిగొస్తున్న క్లాసికల్ మూవీ

image

ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. సినిమా హిట్ లేదా ప్లాప్‌తో సంబంధం లేకుండా చాలా చిత్రాలను థియేటర్లలో విడుదల చేస్తున్నారు. నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ మూవీ సినిమా విడుదలై ఐదేళ్లు కావొస్తున్న నేపథ్యంలో ప్రత్యేక షోలు వేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. నాని కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాల్లో ‘జెర్సీ’ ఒకటి. ఈ నెల 20న ఎంపిక చేసిన థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.

Similar News

News March 20, 2026

తిరుమలలో రేపు కీలక ల్యాబ్‌ల ప్రారంభం

image

తిరుమలలో TTD ఏర్పాటు చేసిన వాటర్&ఫుడ్ అనాలసిస్ ల్యాబోరేటరీతో పాటు FSSAI పరిధిలోని స్టేట్ ఫుడ్ ల్యాబ్‌ను CM చంద్రబాబు శనివారం ఉదయం 11:30కు ప్రారంభించనున్నారు. ఇక్కడ అన్నప్రసాదం, తాగునీరు, ఆహార పదార్థాల నాణ్యతను శాస్త్రీయంగా పరిశీలించనున్నారు.

News March 20, 2026

ఇరాన్ యుద్ధం.. కేంద్రాన్ని సమర్థించిన థరూర్

image

ఇరాన్ విషయంలో కేంద్రం ‘సైలెన్స్’ను కాంగ్రెస్ MP శశి థరూర్ సమర్థించారు. ఈ విషయంలో ఆయన మరోసారి పార్టీ లైన్‌ను దాటారు. కొన్నాళ్లుగా కేంద్రం వైఖరిని కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తోంది. స్వయంగా అగ్రనేత <<19286514>>సోనియా గాంధీ<<>> ఈ విషయంపై వ్యాసం రాశారు. థరూర్ మాత్రం వాటన్నింటితో విభేదిస్తూ.. కేంద్రం ‘సరెండర్’ కాలేదని ‘సంయమనం’ పాటిస్తోందని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అదే సరైన విధానమని పేర్కొన్నారు.

News March 20, 2026

పెరిగిన ‘పవర్’ పెట్రోల్ ధర

image

దేశవ్యాప్తంగా ‘పవర్’ పెట్రోల్ ధర పెరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలైన HPCL, BPCL, IOCL లీటర్‌పై రూ.2.09-రూ.2.35 వరకు వడ్డించాయి. ఈరోజు నుంచే ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. నార్మల్ పెట్రోల్ రేట్‌లో ఎలాంటి మార్పు చేయలేదు. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల క్రూడాయిల్ సరఫరా తగ్గడంతో రేట్లు సవరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వంటగ్యాస్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే.