News September 8, 2024

మనిషి గొంతులో ఇరుక్కున్న బొద్దింక.. చివరికి

image

చైనాలో 58 ఏళ్ల వ్యక్తికి విచిత్ర అనుభవం ఎదురైంది. రాత్రి నిద్రపోతుండగా ముక్కు ద్వారా బొద్దింక గొంతులోకి వెళ్లింది. అసౌకర్యంగా అనిపించినప్పటికీ అలాగే నిద్రపోయాడు. 3 రోజుల తర్వాత శ్వాసలో దుర్వాసన వచ్చింది. దగ్గు పెరిగింది. ENT స్పెషలిస్టు దగ్గరకు వెళ్లగా పరీక్షల్లో ఏమీ కనిపించలేదు. బ్రోంకోస్కోపీ చేయగా శ్వాసనాళంలో కఫంతో నిండిన బొద్దింక కనిపించింది. వైద్యులు దాన్ని శుభ్రం చేసి డిశ్చార్జ్ చేశారు.

Similar News

News December 10, 2025

ఉప్పల్‌లో మెస్సీ పెనాల్టీ షూటౌట్

image

TG: లియోనెల్ మెస్సీ “GOAT టూర్ ఆఫ్ ఇండియా 2025″లో భాగంగా ఈనెల 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడనున్న విషయం తెలిసిందే. సింగరేణి RR, అపర్ణ మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా, చివరి 5 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆడతారని నిర్వాహకులు తెలిపారు. పెనాల్టీ షూటౌట్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఈ భారీ ఈవెంట్ కోసం 33,000 టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

News December 10, 2025

అంతర పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

దీర్ఘకాలిక పంటల మధ్య.. స్వల్పకాలిక పంటలను అంతర పంటలుగా వేసుకోవాలి. పప్పు జాతి రకాలను సాగు చేస్తే పోషకాలను గ్రహించే విషయంలో పంటల మధ్య పోటీ ఉండదు. ప్రధాన పంటకు ఆశించే చీడపీడలను అడ్డుకునేలా అంతరపంటల ఎంపిక ఉండాలి. ప్రధాన, అంతర పంటలపై ఒకే తెగులు వ్యాపించే ఛాన్సుంటే సాగు చేయకపోవడం మేలు. చీడపీడల తాకిడిని దృష్టిలో ఉంచుకొని పంటలను ఎంచుకోవాలి. సేంద్రియ ఎరువుల వాడకంతో ఎక్కువ దిగుబడి పొందవచ్చు.

News December 10, 2025

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) 5 సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా(ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్, మెకానికల్ ఇంజినీర్) ఉత్తీర్ణతతో పాటు 15ఏళ్ల పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసిన అభ్యర్థులు డిసెంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. జీతం నెలకు రూ.30,000-రూ.1,20,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in/