News November 7, 2024
ఎల్లుండి నుంచి సమగ్ర కుటుంబ సర్వే

TG: ప్రభుత్వం నిన్నటి నుంచి కులగణన సర్వే ప్రక్రియ ప్రారంభించింది. ప్రతి ఇంటికీ వెళ్తున్న సిబ్బంది ఇంటి నంబర్, యజమాని పేరు నమోదు చేసుకుంటున్నారు. రేపటి వరకు ఆ వివరాలన్నీ సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఎల్లుండి నుంచి కుటుంబ సర్వే మొదలవుతుంది. ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబ సభ్యుల సమగ్ర వివరాలను ఎంటర్ చేస్తారు. ఈ ప్రక్రియను నవంబర్ నెలాఖరులోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Similar News
News October 28, 2025
‘జీర్ణం వాతాపి జీర్ణం’ అని ఎందుకంటారు?

ఇల్వలుడు, వాతాపి అనే రాక్షస సోదరులు ప్రయాణికులను మోసం చేస్తూ ఉండేవారు. వాతాపి మేకగా మారి, వంటగా వడ్డింపబడి, భోజనం తర్వాత కడుపు చింపుకొని బయటకు వచ్చేవాడు. ఇలా అగస్త్యుడు ఓనాడు వాతాపిని తిన్నాడు. ఇల్వలుడు వాతాపిని పిలవగా అగస్త్యుడు వాతాపి ఎప్పుడో జీర్ణమయ్యాడంటూ కడుపును రుద్దుతూ ‘జీర్ణం వాతాపి జీర్ణం’ అన్నాడు. దీని ఆధారంగా తిన్నది బాగా జీర్ణం కావాలని ఇలా చెప్పడం అలవాటుగా మారింది. <<-se>>#DHARMASANDEHALU<<>>
News October 28, 2025
రాబోయే 2-3 గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు

TG: రాబోయే 2-3 గంటల్లో మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. HYD, జగిత్యాల, గద్వాల్, కామారెడ్డి, మేడ్చల్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, NZB, సిరిసిల్ల, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
News October 28, 2025
మరోసారి బాలకృష్ణకు జోడీగా నయనతార?

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో నయనతార హీరోయిన్గా నటించే అవకాశాలున్నాయని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్లో ప్రారంభం అవుతుందని సమాచారం. గతంలో బాలకృష్ణ, నయనతార కాంబోలో సింహా, శ్రీరామరాజ్యం సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.


