News December 2, 2024
సమగ్ర విచారణకు ఆదేశించాలి.. CMకు పవన్ రిక్వెస్ట్

AP: కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని, దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని CM చంద్రబాబును Dy.CM పవన్ కోరారు. గత మూడేళ్లలో ₹48,537CR విలువైన బియ్యం కాకినాడ పోర్టు నుంచి తరలించారని, దీనిపై వాస్తవాలు బయటకు తీయాల్సిన అవసరం ఉందన్నారు. YCP ప్రభుత్వ హయాంలో పోర్టులోకి ఎవరినీ అనుమతించలేదని, ఇటీవల అక్కడికి వెళ్లిన తనకూ ఇబ్బంది ఎదురైందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
Similar News
News December 20, 2025
జోనర్లు మార్చుకుంటున్న రవితేజ

గతంలో వరుసగా మాస్ సినిమాలు చేసిన రవితేజ ప్రస్తుతం తన పంథా మార్చారు. ఇటీవల ఒక్కో సినిమాకు ఒక్కో జోనర్ సెలక్ట్ చేసుకొని అలరిస్తున్నారు. ధమాకాతో మాస్, రావణాసురతో థ్రిల్లర్‌కు ఓటేసిన ఆయన టైగర్ నాగేశ్వరరావుతో పీరియాడిక్ డ్రామా ఎంచుకున్నారు. త్వరలో అనుదీప్‌తో కామెడీకి సిద్ధమవుతున్నారు. సంక్రాంతికి ఫ్యామిలీ డ్రామా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో వస్తున్నారు. ఈ మూవీ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.
News December 20, 2025
ఈ నెల 24న కొడంగల్‌కు సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 24 తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల కొత్తగా ఎన్నికైన సర్పంచులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. వారిలో ముఖాముఖితో పాటు గ్రామాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. సీఎం పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు.
News December 20, 2025
చిన్నారులకు HIV సోకిన రక్తం.. బాధ్యులకు ఏ శిక్ష విధించాలి?

MPలోని సాత్నా ప్రభుత్వాసుపత్రిలో తలసేమియా చిన్నారులకు రక్తమార్పిడి వేళ HIV సోకిన రక్తాన్ని ఎక్కించారు. రక్త సేకరణలో అజాగ్రత్తే దీనికి కారణం కాగా, బాధ్యులైన బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్, ల్యాబ్ టెక్నీషియన్లు సస్పెండ్ అయ్యారు. అయితే చిన్నారుల బంగారు భవితను నాశనం చేసిన వీరికి ఏ శిక్ష విధిస్తే సరిపోతుంది? తమ పిల్లల్లైతే ఇలాగే చేస్తారా? తల్లిదండ్రులకు ఏం చెప్పి ఓదార్చగలం? అని నెటిజన్లు ఫైరవుతున్నారు.


