News March 1, 2025

‘అందుకొనేంత దూరంలో అభివృద్ధి చెందిన దేశం’

image

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న లక్ష్యం అందుకొనేంత దూరంలోనే ఉందని 16వ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ అరవింద్ పనగడియా అన్నారు. ఇందుకు కొన్ని సంస్కరణలు అవసరమని సూచించారు. ‘ప్రస్తుత ధరల వద్ద డాలర్‌ ప్రాతిపదికన 2003-24 వరకు భారత్ 10.1% వృద్ధిరేటు సాధించింది. మరో పదేళ్లు ఇదే రేటు కొనసాగిస్తే దేశం $9.5T ఎకానమీ అవుతుంది. 2047 నాటికి తలసరి ఆదాయం $14000 కావాలంటే 7.3% గ్రోత్ అవసరం’ అని వివరించారు.

Similar News

News November 10, 2025

మెడికల్ విద్య కోసం ఇప్పుడు జార్జియా వైపు!

image

భారత్ నుంచి అనేకమంది వైద్యవిద్య కోసం గతంలో ఉక్రెయిన్‌కు వెళ్లేవారు. రష్యాతో యుద్ధంతో ఇప్పుడు జార్జియా వైపు మళ్లుతున్నారు. RBI ప్రకారం అక్కడ ఈ చదువు కోసం 2018-19లో $10.33M వెచ్చించగా 2024-25లో అది $50.25Mలకు పెరిగింది. కాగా వారు ఇండియా వచ్చాక NExT/FMGE పాస్ కావాలి. జార్జియా నుంచి వచ్చే వారిలో 35% మాత్రమే ఉత్తీర్ణులవుతున్నారు. అక్కడి వర్సిటీల గురించి ముందే తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News November 10, 2025

PM కిసాన్ లిస్టులో మీ పేరు లేదా? కారణమిదే!

image

PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం నుంచి లక్షలాది మంది లబ్ధిదారులను తొలగించారన్న ప్రచారంపై కేంద్రం వివరణ ఇచ్చింది. ‘గైడ్‌లైన్స్ ప్రకారం 2019 FEB 1 తర్వాత భూమి కొన్న వారికి ఈ స్కీమ్ వర్తించదు. ఒకే ఫ్యామిలీ నుంచి భర్త, భార్య, పిల్లలు వేర్వేరుగా లబ్ధి పొందుతున్నట్లు గుర్తించాం. అలాంటి వారికి తాత్కాలికంగా నిలిపివేశాం. ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత అర్హులని తేలితే మళ్లీ జాబితాలో చేర్చుతాం’ అని పేర్కొంది.

News November 10, 2025

క్రీడాకారులకు గ్రూప్-1 ఉద్యోగాలపై భిన్నాభిప్రాయాలు

image

మహిళా క్రికెటర్ శ్రీ చరణికి గ్రూప్-1, స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్, బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగాలిచ్చి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గౌరవించాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కాకుండా స్పోర్ట్స్ కోటాలో వారికి ఉద్యోగాలివ్వడంపై పలువురు ఫైరవుతున్నారు. క్రీడాకారులను ప్రోత్సహించే దిశగానే ప్రభుత్వాల నిర్ణయాలని కొందరు సమర్థిస్తున్నారు.