News April 16, 2024
బ్లాక్‌బస్టర్ మూవీ రీమేక్‌లో క్రేజీ డైరెక్టర్?

క్రేజీ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ బ్లాక్‌బస్టర్ మూవీ రీమేక్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. మలయాళ చిత్రం ‘జయ జయ జయ జయహే’ రీమేక్‌లో ఆయన లీడ్ రోల్‌లో నటిస్తారని సమాచారం. భార్యాభర్తల మధ్య గొడవ నేపథ్యంలో ఈ మలయాళ మూవీ తెరకెక్కింది. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. దీంతో రీమేక్‌లో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు? తరుణ్ భాస్కర్ రోల్ ఏంటి? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.
Similar News
News April 9, 2026
జగిత్యాల బీఆర్‌ఎస్‌లో కొత్త జోష్.. కేటీఆర్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి!

జగిత్యాల జిల్లాలో నేడు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్న నేపథ్యంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీనియర్ నేత జీవన్‌రెడ్డిని బీఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉందన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ పర్యటనతో జిల్లా బీఆర్‌ఎస్ క్యాడర్‌లో కొత్త జోష్ రావడం ఖాయమని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
News April 9, 2026
భారీగా తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24, 22 క్యారెట్ల పసిడి ధరలు భారీగా పడిపోయాయి. 24క్యారెట్ల 10గ్రా.ల గోల్డ్ రేటు రూ.2,340 తగ్గి రూ.1,51,480కు చేరింది. 22క్యారెట్ల 10గ్రా.ల పసిడి ధర రూ.2,150 పతనమై రూ.1,38,850 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,65,100గా ఉంది.
News April 9, 2026
పిల్లలను ట్యూషన్‌కు పంపుతున్నారా?

పిల్లలందరికీ ట్యూషన్ అవసరం లేదు కానీ పేరెంట్స్ పర్యవేక్షణ ముఖ్యమని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. ‘చదువులో కాన్ఫిడెంట్‌గా ఉంటూ రాణిస్తుంటే ట్యూషన్ పేరుతో మరో భారం వద్దు. అవసరం లేకపోయినా పంపితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. మెంటల్ ప్రెజర్ పెరుగుతుంది. చదువు బోర్ కొడుతుంది. ఆడుకునే సమయం తగ్గిపోవడం వల్ల ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండలేరు. ఇంట్లో సరైన గైడెన్స్ లేకపోతే ట్యూషన్ అవసరం’ అని చెబుతున్నారు.


